ఆహార భద్రతా నియమాలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నవిత హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్ ప్రాంతంలో పలు ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లను హోటళ్లను బుధవారం తనిఖీ చేశారు.
అమాయకులపై దాడులకు పాల్పడిన ముష్కరులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి డిమాండ్ చేశారు. ఈ మేరకు డీజీపీ శివధర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు.