అక్షరటుడే, ఇందూరు: Flag Day | సాయుధ దళాల పతాక దినోత్సవ (Armed Forces Flag Day) విరాళాల సేకరణలో నిజామాబాద్ జిల్లా గడిచిన పదేళ్లలో ఏకంగా ఏడుసార్లు ముందంజలో నిలిచి రికార్డు సృష్టించింది.
ఈ ఏడాది సైనిక సంక్షేమ నిధికి అత్యధిక విరాళాలు సేకరించిన సందర్భంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Governor Jishnu Dev Verma) నిజామాబాద్ జిల్లా ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి రవీందర్‌కు ట్రోఫీ బహూకరించారు.
శనివారం సాయంత్రం సైనిక సంక్షేమ అధికారి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని (Collector Vinay Krishna Reddy) మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..ఇదే స్ఫూర్తితో వచ్చే ఏడాది మరింత పెద్ద మొత్తంలో సైనిక సంక్షేమ నిధికి విరాళాలు సేకరించాలని సూచించారు.
Flag Day | తెలంగాణ ఆవిర్భావం అనంతరం..
తెలంగాణ ఆవిర్భావం అనంతరం 2015 నుంచి రాష్ట్రంలో సాయుధ దళాల పతాక దినోత్సవ విరాళాలను అత్యధిక స్థాయిలో సేకరించిన జిల్లాకు ఏటేటా ట్రోఫీలు అందిస్తున్నారని ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి రవీందర్ తెలిపారు.
ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ల తోడ్పాటుతో నిజామాబాద్ జిల్లా వరుసగా 2015 నుండి 2019 వరకు ఐదేళ్ల పాటు విరాళాల సేకరణలో ముందంజలో నిలిచి, ట్రోఫీలు అందుకుందని తెలిపారు.
అలాగే, 2023లో తాజాగా ఈ ఏడాది కూడా మొదటిస్థానంలో నిలిచి పదేళ్లలో ఏడు పర్యాయాలు నిజామాబాద్ జిల్లా ట్రోఫీని దక్కించుకుందని తెలిపారు.
