అక్షరటుడే, ఆర్మూర్: Excise Department : నిజామాబాద్ జిల్లా(Nizamabad district) ఆర్మూర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్(Station House Officer) అంజిత్ రావు, ఆఫీసర్స్ సిబ్బంది ఆధ్వర్యంలో స్కూల్ బ్యాగుల (School bags) వితరణ చేపట్టారు. 100 మంది పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, స్టేషనరీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు ప్రమోద్ చైతన్య, చంద్రమౌళి, ప్రభాకర్, హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.
