అక్షరటుడే, వెబ్డెస్క్: Hyderabad | హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి (Drinking Water) సరఫరాలో అంతరాయం కలిగినట్లు జలమండలి అధికారులు తెలిపారు. లీకేజీలకు మరమ్మతులు చేపడుతుండటంతో 12 గంటల పాటు నీటి సరఫరా నిలిపి వేసినట్లు పేర్కొన్నారు.
మహానగరానికి తాగునీరు సరఫరా చేసే సింగూరు ప్రాజెక్టు (Singur Project) ఫేజ్ – 3 మెయిన్ పైప్‌లైన్‌లో భారీ లీకేజీ ఏర్పడింది. దీంతో అధికారులు, సిబ్బంది అత్యవసరంగా మరమ్మతులు చేపడుతున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పలు ప్రాంతాలకు నీటి సరఫరా నిలిపి వేసినట్లు తెలిపారు. ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించుకొని అధికారులకు సహకరించాలని కోరారు. మరమ్మతులు పూర్తి చేసిన అనంతరం నీటి సరఫరాను పునరుద్ధరిస్తామన్నారు.
Hyderabad | అంతరాయం ఏర్పడే ప్రాంతాలు
కేపీహెచ్‌బీ, బోరబండ, గాయత్రి నగర్, మూసాపేట్, భారత నగర్.బంజారాహిల్స్, సోమాజిగూడ, వెంకటగిరి, యల్లారెడ్డిగూడ, ఎర్రగడ్డ, ఎస్పీఆర్ హిల్స్, కొండాపూర్, డోయెన్స్, మాధాపూర్ ప్రాంతాల్లో నీటి సరఫరాను నిలిపివేశారు. గోపాల్ నగర్, తెల్లాపూర్ ప్రాంతాల్లో సైతం నీటి సరఫరాలో అంతరాయం నెలకొంది.