అక్షరటుడే, భీమ్గల్: Bheemgal | భీమ్గల్ మండల పాస్టర్స్ అసోసియేషన్ (Bheemgal) కార్యవర్గ సమావేశాన్ని అధ్యక్షుడు రిక్క దేవదాస్ అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్తులో చేపట్టబోయే ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలపై (social programs) సుదీర్ఘంగా చర్చించారు.
Bheemgal | గుర్తింపు పొందిన సంస్థ..
ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ.. మండల పాస్టర్స్ అసోసియేషన్ ప్రభుత్వ రిజిస్ట్రేషన్ కలిగి ఉండి, అధికారిక గుర్తింపు పొందిన సంస్థ అని తెలిపారు. ఇటీవల మండలంలో కొత్తగా ఏర్పాటైన ఇతర అసోసియేషన్లతో తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. అసోసియేషన్ బలోపేతానికి త్వరలోనే ఒక తేదీని నిర్ణయించి, పారదర్శకంగా కార్యవర్గ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. సమావేశంలో షడ్రక్, టి.డేవిడ్ రాజ్ (చేంగల్), జి.ప్రేమ్ కుమార్, సీహెచ్. ఇశ్రాయేలు, పరంజ్యోతి, డి. జేమ్స్, ఏలియా, సోలోమన్ తదితరులు పాల్గొన్నారు.