అక్షరటుడే, వెబ్డెస్క్: Director Teja | ప్రముఖ డైరెక్టర్ తేజ కుమారుడిని ట్రేడింగ్ పేరుతో నమ్మించి దంపతులు టోకరా వేశారు. లాభాలు వస్తాయని చెప్పి రూ.72 లక్షలు కాజేశారు.
హైదరాబాద్ (Hyderabad)కు చెందిన దంపతులకు డైరెక్టర్ తేజ కుమారుడు అమితవ్ తేజను ట్రేడింగ్ పేరుతో మోసం చేశారు. అమితవ్ నగరంలో నివాసం ఉంటున్నాడు. ఆయనకు మోతీనగర్ (Mothinagar)కు చెందిన యార్లగడ్డ అనూష, కొండపనేని ప్రణీత్ దంపతులతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ట్రేడింగ్ చేస్తే భారీ లాభాలు వస్తాయని వారు అమితవ్కు చెప్పారు.
Director Teja | అపార్ట్మెంట్ రాసి ఇస్తాం
ట్రేడింగ్లో ఇన్వెస్ట్ చేయాలని వారు ఆయనకు సూచించారు. ఒకవేళ నష్టాలు వస్తే తాము ఉంటున్న అపార్ట్మెంట్ రాసిస్తామని హామీ ఇచ్చారు. దీంతో అమితవ్ వారి మాటలు నమ్మాడు. పలు దశల్లో వారికి రూ.72 లక్షలు అందించాడు. అయితే ఎంతకు లాభాలు ఇవ్వకపోగా.. అసలు గురించి అడిగిన ఆ దంపతులు స్పందించలేదు. డబ్బుల కోసం నిలదీయడంతో ముఖం చాటేశారు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన అమితవ్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ (Jubilee Hills Police Station)లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్త చేస్తున్నారు.