అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Dimple Hayati | టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతి (Heroine Dimple Hayathi) మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి సినిమా కారణంగా కాదు.. తన వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియా (Social Media)లో చక్కర్లు కొడుతున్న తప్పుడు ప్రచారాలతో. సెలబ్రిటీలు కావడంతో రూమర్స్ రావడం సహజమే అయినా, అవి హద్దులు దాటినప్పుడు స్పందించక తప్పదని డింపుల్ నిరూపించారు.
ఇటీవల సోషల్ మీడియాలో ఓ నెటిజన్ డింపుల్‌కు ఇప్పటికే పెళ్లి అయిపోయిందని వ్యాఖ్యానించడం చర్చకు దారి తీసింది. అంతేకాదు, ఆమె భర్త అంటూ ఒక వ్యక్తిని ప్రస్తావిస్తూ, అతనిపై పోలీస్ కేసులు నమోదయ్యాయంటూ పాత ఆర్టికల్‌ను షేర్ చేయడంతో విషయం మరింత వైరల్ అయింది. ఈ ప్రచారాన్ని గమనించిన డింపుల్ సైలెంట్‌గా ఉండకుండా వెంటనే స్పందించారు.
Dimple Hayati | ఇది క్లారిటీ
“నాకు ఇప్పటికీ పెళ్లి కాలేదు. నా గురించి షేర్ చేస్తున్న ఆ న్యూస్ పూర్తిగా ఫేక్” అంటూ ఆమె స్పష్టంగా చెప్పేశారు. ఎలాంటి సందేహాలకు తావు లేకుండా ఒక్క మాటతో అన్ని పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని కూడా అభిమానులకు విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగత జీవితంపై ఆధారం లేని ప్రచారం చేయడం వల్ల ఇమేజ్‌తో పాటు కెరీర్‌కూ నష్టం వాటిల్లుతుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది. సాధారణంగా హీరోయిన్లు ఇలాంటి విషయాల్లో మౌనంగా ఉండడానికే ఇష్టపడతారు. కానీ డింపుల్ మాత్రం సోషల్ మీడియా వేదికగానే క్లారిటీ ఇచ్చి, రూమర్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు.
ప్రొఫెషనల్ విషయానికి వస్తే, డింపుల్ హయాతి తాజాగా సంక్రాంతి కానుకగా విడుదలైన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ (Bhartha Mahashayulaku Vijnapti) సినిమాలో నటించారు. రవితేజ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ ఆమెకు మరో అవకాశం అయినప్పటికీ, ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. గతంలో చేసిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ అందుకోలేకపోవడంతో, ఇప్పుడు ఆమె కెరీర్‌లో ఒక గట్టి టర్నింగ్ పాయింట్ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.ఒకవైపు సినిమాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తూనే, మరోవైపు తన వ్యక్తిగత జీవితంపై వచ్చే నెగటివ్ ప్రచారాన్ని ధైర్యంగా ఎదుర్కొంటున్న డింపుల్ హయాతి… ఇకపై ఎలాంటి అవకాశాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి.