అక్షరటుడే, వెబ్‌డెస్క్: Maoists | మావోయిస్టు పార్టీలో (Maoist party) అంతర్గత విబేధాలు బయట పడ్డాయి. ఇటీవల తాము ఆయుధాలు వీడటానికి సిద్ధంగా ఉన్నామని అభయ్ పేరిట లేఖ బయటకు రావడంతో పార్టీలో లుకలుకలు ఉన్నట్లు స్పష్టం అయింది.
ఆపరేషన్ కగార్(Operation Kagar) ఆపేస్తే.. తాము ఆయుధాలు వీడి లొంగిపోతామని ఇటీవల అభయ్ పేరిట లేఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిని ఇప్పటికే మావోయిస్టులు ఖండించారు. ఆ ప్రకటన అభయ్ వ్యక్తిగతంగా పేర్కొన్నట్లు చెప్పారు. తాము శాంతి చర్చలు జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అయితే ఆయుధాలు వీడుతామనే ప్రకటన మాత్రం చేయలేదన్నారు.
Maoists | ఆయుధాలు అప్పగించాలి
మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ (Mallojula Venugopal alias Abhay) లేఖతో కేంద్ర నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. అభయ్ పేరిట కేంద్రంతో శాంతి చర్చలకు పిలుపునిచ్చిన ఆయనను పార్టీ ద్రోహిగా పేర్కొంది. ఆయన వద్ద ఉన్న ఆయుధాలు వెంటనే అప్పగించాలని ఆదేశించింది. లేకపోతే పీపుల్స్ గెరిల్లా ఆర్మీ (People’s Guerrilla Army) ఆయుధాలను స్వాధీనం చేసుకుంటుందని చెప్పింది. ఓ వైపు ఆపరేషన్ కగార్, మరోవైపు లొంగుబాటులతో ఇబ్బందులు పడుతున్న నక్సల్స్‌కు ఇప్పుడు అంతర్గత కలహాలు తోడయ్యాయి. విబేధాలతో ఉద్యమం మరింత నీరు గారే అవకాశం ఉందని పలువురు అనుకుంటున్నారు.
Maoists | ఆయన తమ్ముడే..
మల్లొజుల వేణుగోపాల్ మావోయిస్టు కీలక నేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీ తమ్ముడు. కిషన్‌జీ 2011లో బెంగాల్ (Bengal)లో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయారు. కిషన్ జీ భార్య గద్వాలకు చెందిన సుజాతక్క అలియాస్ పోతుల కల్పన ఇటీవల తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఎన్నో కేసుల్లో నిందితురాలిగా ఉన్న ఆమె అనారోగ్య కారణాలతో డీజీపీ ఎదుట సరెండర్ అయ్యారు.