అక్షరటుడే, ఇందూరు: Munnuru Kapu Sangham | మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ (Former Mayor Dharmapuri Sanjay) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల నగరంలోని మున్నూరుకాపు సంఘాలతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Munnuru Kapu Sangham | పట్టణ మున్నూరుకాపు సంఘంలో..
ఈ సందర్భంగా మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ మాట్లాడుతూ.. నగరంలోని ప్రగతి నగర్ మున్నూరుకాపు సంఘంలో ఆదివారం ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగనుందన్నారు. మున్నూరుకాపు సంఘా సభ్యులందరూ తప్పనిసరిగా కార్యక్రమానికి హాజరు కావాలని ఆయన కోరారు.
