DGCA imposed IndiGo Airlines | ఇండిగో ఎయిర్​లైన్స్​కు డీజీసీఏ భారీ జరిమానా

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: DGCA imposed IndiGo Airlines | 2025 డిసెంబరులో విమాన సర్వీసుల రద్దు, జాప్యం వల్ల ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేసిన ఇండిగో ఎయిర్ లైన్స్‌పై పౌర విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ చర్యలు చేపట్టింది. ఈ ఇండిగోకు పెద్ద ఎత్తున జరిమానా విధించింది. గత నెల విమాన సర్వీసుల అంతరాయంపై దర్యాప్తు చేపట్టిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ Directorate General of Civil Aviation (DGCA).. తాజాగా ఇండిగో సంస్థకు రూ. […]

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: DGCA imposed IndiGo Airlines | 2025 డిసెంబరులో విమాన సర్వీసుల రద్దు, జాప్యం వల్ల ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేసిన ఇండిగో ఎయిర్ లైన్స్‌పై పౌర విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ చర్యలు చేపట్టింది. ఈ ఇండిగోకు పెద్ద ఎత్తున జరిమానా విధించింది. గత నెల విమాన సర్వీసుల అంతరాయంపై దర్యాప్తు చేపట్టిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ Directorate General of Civil Aviation (DGCA).. తాజాగా ఇండిగో సంస్థకు రూ. 22.20 కోట్ల జరిమానా విధించింది. దీనికితోడు సంస్థ సీనియర్ మేనేజ్‌మెంట్‌పై కఠినమైన చర్యలు తీసుకున్నట్లు ప్రకటించింది.

DGCA imposed IndiGo Airlines | మూడు రోజుల్లోనే..

గతేడాది (డిసెంబర్ 3 – 5వ తేదీల మధ్య) ఇండిగో విమాన సర్వీసులు అస్తవ్యస్తమయ్యాయి. ఆ మూడు రోజుల్లో సుమారు 2,507 విమానాలు రద్దయ్యాయి. దీనితోడు 1,852 విమానాలు గంటల తరబడి ఆలస్యంగా నడిచాయి. దీనివల్ల ఆయా విమానాశ్రయాల్లో దాదాపు 3 లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

ఈ క్రమంలో కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ Union Ministry of Civil Aviation ఆదేశాలతో విచారణ నిమిత్తం డీజీసీఏ నలుగురు సభ్యులతో కమిటీని నియమించింది. దర్యాప్తులో ఇండిగో వైఫల్యాలు వెల్లడయ్యాయి. సామర్థ్యానికి మించి సర్వీసు ప్రణాళికలు చేయడం వల్ల ఇబ్బందులు తలెత్తినట్లు విచారణలో వెల్లడైంది. రెగ్యులేటరీ నిబంధనలను కూడా తుంగలో తొక్కినట్లు నిర్ధారించారు. విమానయాన సాఫ్ట్‌వేర్ సిస్టమ్‌లు కూడా బలహీనంగా ఉన్నాయని తేలింది. ముందస్తు ప్రణాళిక లేకపోవడం, అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడంలో విఫలం కావడాన్ని కూడా గుర్తించారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...