అక్షరటుడే, లింగంపేట : Bheemeswara Temple | మాఘ అమావాస్య (Magha Amavasya) పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు ఆలయాలను దర్శించుకుంటున్నారు. తాడ్వాయి మండలం సంతాయిపేట అటవీ ప్రాంతంలోని భీమేశ్వర ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. కామారెడ్డి జిల్లాలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన భీమేశ్వర ఆలయానికి (Bheemeswara Temple) మాఘ అమావాస్య సందర్భంగా భక్తులు తరలివస్తారు. ఈ నేపథ్యంలో ఉంచుకొని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు (Yellareddy DSP Srinivas Rao) , తాడ్వాయి ఎస్సై నరేష్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Bheemeswara Temple | పవిత్ర స్నానాలు
భీమేశ్వర వాగులో పవిత్ర స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ముందస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించారు. భీమేశ్వర ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో పార్కింగ్ ఇబ్బంది రాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు నెమ్మదిగా వెళ్లాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు
భీమేశ్వర జాతరను పురస్కరించుకొని కామారెడ్డి ఆర్టీసీ (Kamareddy RTC) ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. స్పెషల్ బస్సులను ఆలయం వరకు నడిపిస్తున్నారు. కామారెడ్డి నుంచి తాడ్వాయి మీదుగా సంతాయి పేట్ భీమేశ్వర ఆలయానికి బస్ సర్వీసులను ఏర్పాటు చేశారు.