అక్షరటుడే, వెబ్డెస్క్: Medraram Jathara | ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక్క–సారలమ్మ (Sammakka-Saralamma) దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
మేడారం మహా జాతర ఈ నెల 28 నుంచి 31 వరకు సాగనుంది. ఈ క్రమంలో జాతర సమయంలో రద్దీ అధికంగా ఉంటుంది. దీంతో పలువురు భక్తులు ముందుగానే దర్శనం చేసుకుంటున్నారు. సంక్రాంతి పండుగ (Sankranti Festival) అయిపోవడం, బడులకు నేటితో సెలవులు ముగియనుండటంతో భక్తులు మేడారం భారీగా తరలి వచ్చారు. ముందస్తు మొక్కలతో వన దేవతల గద్దెల పరిసరాలు జనసంద్రంగా మారాయి.
Medraram Jathara | నిలిచిపోయిన వాహనాలు
మేడారానికి వేలాదిగా వాహనాల్లో భక్తులు తరలి వెళ్తున్నారు. దీంతో ములుగు గట్టమ్మ తల్లి టెంపుల్ దగ్గర ట్రాఫిక్ జామ్ (Traffic Jam) అయింది. జకారం నుంచి మేడారం వరకు వాహనాల రద్దీ నెలకొంది. చింతల్ క్రాస్ వద్ద 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వెంగళపూర్ నుంచి నార్లాపూర్ వరకు వాహనాలు ఆగిపోయాయి. 4 లక్షల మందికిపైగా భక్తులు తరలివచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వాహనాలు నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు, అధికారులు ట్రాఫిక్ క్రమబద్దీకరణకు చర్యలు చేపడుతున్నారు. కన్నెపల్లి, జంపన్నవాగు, హరిత హోటల్ వరకు ట్రాఫిక్ స్తంభించింది. పొలాల్లో పార్కింగ్ కోసం వాహనాలను మళ్లిస్తున్నారు.
జాతర సమీపిస్తుండటంతో రానున్న రోజుల్లో భక్తుల రద్దీ మరింత పెరగనుంది. ఈ నెల 18న సీఎం మేడారం (Medaram)లో బస చేయనున్నారు. 19న వన దేవతల గద్దెలను ఆయన ప్రారంభిస్తారు. ఈ క్రమంలో భక్తుల దర్శనాలపై ఆంక్షలు, ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టనున్నారు. దీంతో భక్తులు సూచనలు పాటించాలని అధికారులు కోరుతున్నారు.