అక్షరటుడే, ఎల్లారెడ్డి: MLA Madan Mohan | కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎల్లారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధి బాటలో సాగుతోందని ఎమ్మెల్యే మదన్ మోహన్ (MLA Madan Mohan) అన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని 2, 4, 12 వార్డుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆయా వార్డుల సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. వార్డుల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, ఇందిరమ్మ ఇళ్లు (Indiramma houses) తదితర అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు.
MLA Madan Mohan | సమస్యల పరిష్కారానికి కృషి..
వార్డు ప్రజలతో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్థానికంగా ఉన్న సమస్యలను తప్పనిసరిగా పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ప్రజలు ప్రస్తావించిన చిన్నచిన్న సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకుండా, వెంటనే అధికారులు నోట్ చేసుకునేలా ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ.. గత 30ఏళ్లలో తమ వార్డులో ఈ స్థాయిలో అభివృద్ధి ఎప్పుడూ జరగలేదని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. పెండింగ్లో ఉన్న పనులను మున్సిపల్ ఏఈ ద్వారా నమోదు చేసుకున్నామని వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ వార్డు అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
MLA Madan Mohan | రూ.22 కోట్లతో నాగిరెడ్డిపేట్ మండలం అభివృద్ధి
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో(Yellareddy constituency) రూ.22 కోట్లతో నాగిరెడ్డిపేట్ మండలం అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే అన్నారు. నియోజకవర్గంలో మూడు క్రీడా మైదానాలు సైతం నిర్మిస్తున్నట్లు తెలిపారు. నాగిరెడ్డిపేట మండలంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీలు ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడారు. క్రీడలతో స్నేహభావం పెరుగుతుందన్నారు.
మండలం అభివృద్ధి కోసం రూ.22.77 కోట్ల నిధులను వెచ్చించినట్లు తెలిపారు. పోచారం ప్రాజెక్టు ఆధునీకరణ కోసం రూ.3.16 కోట్లతో గోదాముల నిర్మాణం, రూ.73 లక్షలతో త్రిలింగేశ్వర ఆలయం అభివృద్ధి, రూ.2కోట్లతో నిజాంసాగర్ ముందపు ప్రాంతాల్లో చెట్ల తొలగింపు పనులను చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల పోచారం ప్రాజెక్ట్, నాగిరెడ్డిపేట మండలం వెనుకబడ్డాయన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్, రామచందర్ రెడ్డి, విఠల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.