అక్షరటుడే, ఎల్లారెడ్డి : MLA Madan Mohan | పట్టణంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని ఎమ్మెల్యే మదన్మోహన్ అన్నారు. ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే మదన్మోహన్కు ఆయా వార్డుల ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు.
MLA Madan Mohan | అభివృద్ధి పనుల పర్యవేక్షణ..
ఎల్లారెడ్డి మున్సిపాలిటీ (Yellareddy Municipality) పరిధిలో వార్డుల్లో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పనులను ఆయన ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. వాడల్లో జరుగుతున్న పనులు నాణ్యతగా చేపట్టాలని.. త్వరితగతిన పనులు పూర్తిచేసి ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు గుత్తేదారులను ఎమ్మెల్యే ఆదేశించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రతివార్డులో సమస్యల పరిష్కారానికి నిధులిస్తానని హామీ ఇచ్చారు.
MLA Madan Mohan | బస్టాండ్ అభివృద్ధి..
ముఖ్యంగా బస్స్టాండ్ అభివృద్ధి, మినీ ట్యాంక్ బండ్, సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, వీధిదీపాలు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు పట్టణంలో కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే ప్రజలకు వివరించారు. వెనుకబడి ఉన్న ఎల్లారెడ్డిని విద్య, వైద్యం పర్యాటక రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేపించినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు చేయలేని అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) చేసి చూపిస్తోందని ఆయన స్పష్టం చేశారు.
ఎల్లారెడ్డి మున్సిపల్ 7వ వార్డులో పర్యటించిన ఎమ్మెల్యే మదన్ మెహన్ ముదిరాజ్ సంఘం భవన అభివృద్ధి కోసం రూ.5 లక్షల నిధులు మంజూరు. బ్రాహ్మణ సంఘం, ఆర్య కటికె సంఘం, గంగపుత్ర కమ్యూనిటీ సంఘాలకు ఒక్కో సంఘానికి రూ.3 లక్షల చొప్పున నిధులు మంజూరు ఇచ్చారు. అదేవిధంగా 7వ వార్డులో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses) నిర్మాణాలను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించి, లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా నాణ్యమైన నిర్మాణాలు చేపట్టాలని, పనులు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా చర్యలు తీసుకుంటామని, ఎల్లారెడ్డి పట్టణ సర్వతోముఖాభివృద్ధే తమ లక్ష్యమని ఎమ్మెల్యే ఈ సందర్భంగా పేర్కొన్నారు. 6వ వార్డులో ఉస్మానియా మజీద్ కమ్యూనిటీ హాల్ పనుల నిమిత్తం 5 లక్షల నిధులు మంజూరు ప్రొసీడింగ్ పత్రాన్ని మైనార్టీ ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా మజీద్ కమిటీ పెద్దలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎస్ఐ చర్చిలో (CSI Church) నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ఐ చర్చి వద్ద రూ.25 లక్షల ప్రత్యేక నిధులతో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. అలాగే చర్చి అభివృద్ధికి మరిన్ని ప్రత్యేక నిధులు తీసుకురావడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.