అక్షరటుడే, ఆర్మూర్ : Minister Seethakka | రానున్న గోదావరి పుష్కరాలకు బాసర నుంచి భద్రాచలం (Basara to Bhadrachalam) వరకు అన్ని పుష్కర ఘాట్లను అభివృద్ధి చేస్తామని తెలంగాణ రాష్ట్ర గిరిజన శాఖ సంక్షేమ మంత్రి సీతక్క తెలిపారు.
పట్టణంలో పలు అభివృద్ధి పనులకు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డితో (MLA Paidi Rakesh Reddy) కలిసి బుధవారం ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మేడారం జాతరకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నిధులు కేటాయించి అన్ని వసతులు కల్పించారన్నారు.
Minister Seethakka | రానున్న పుష్కరాలకు నిధులిస్తాం..
రానున్న పుష్కరాలకు సైతం సమ్మక్క సారక్క జాతకు కేటాయించినట్లుగానే నిధులు కేటాయించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూస్తామని సీతక్క తెలిపారు. ఈ ప్రాంతంలోని దేవాలయాలను అభివృద్ధి పరుస్తామన్నారు. పట్టణ గ్రామాల అభివృద్ధికి కేంద్రం సహకరించాలన్నారు. ఉపాధిహామీ పనులను తగ్గించకుండా 100 రోజులైనా పని కల్పించి నిధులను భరించాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోం మంత్రిత్వ శాఖను స్వయంగా తానే పర్యవేక్షిస్తూ యువత ఉన్నత లక్ష్యంగా అడుగులు వేస్తున్నారన్నారు.
అందులో భాగంగానే ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం (Arrive Alive Program) ద్వారా ట్రాఫిక్ నిబంధనలపై అవగాహనలు కల్పిస్తూ ముందుకు సాగతున్నామన్నారు. ప్రాణం ఉంటే అన్ని సాధించవచ్చునని, వేగం వద్దు ప్రాణం ముద్దని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి, ఏఎంసీ ఛైర్మన్ సాయిబాబా గౌడ్, యామాద్రి భాస్కర్, సంజయ్ సింగ్ బబ్లు, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, ఎస్హెచ్వో సత్యనారాయణ గౌడ్, కాంగ్రెస్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.