అక్షరటుడే, ఎల్లారెడ్డి: Mla Madan Mohan | నియోజకవర్గాన్ని ఇచ్చిన మాట ప్రకారం అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే మదన్ మోహన్ (MLA Madan Mohan) అన్నారు. ఎల్లారెడ్డి మండలంలో రూ. 30 కోట్ల పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.
Mla Madan Mohan | ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో..
ఎల్లారెడ్డి మున్సిపాలిటీ (Yellareddy municipality) పరిధిలో రూ.14 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. రూ.2 కోట్ల నిధులతో ఎల్లారెడ్డి పురపాలక సంఘం పరిధిలోని విలీన గ్రామాల్లో, రూ.4 కోట్ల నిధులతో పురపాలక సంఘం పరిధిలో సీసీ రోడ్లు, డ్రెయినేజీ పనులకు శంకుస్థాపన చేశారు. రూ.5 కోట్ల నిధులతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు, రూ. 3కోట్ల నిధులతో పెద్ద చెరువు వద్ద మల్టీ జనరేషన్ పార్క్ నిర్మాణ పనులకు, రూ.2 కోట్ల నిధులతో వ్యవసాయ మార్కెట్ నూతన భవనం నిర్మాణ పనులు ప్రారంభించారు. మరుగుదొడ్లు, ప్రహరీ, వాణిజ్య సముదాయ నిర్మాణానికి మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ రజిత వెంకటరామిరెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు.
Mla Madan Mohan | లింగంపేట ప్రాథమిక పాఠశాల ఏర్పాటు కోసం..
అలాగే మున్నూరు కాపు సంఘానికి రూ.5 లక్షలు, ముదిరాజ్ సంఘం అభివృద్ధికి రూ.5 లక్షల మంజూరు కాపీలను ఎమ్మెల్యే అందజేశారు. ఎస్సీ వాడలో అంగన్‌వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. లింగారెడ్డిపేట ప్రాథమిక పాఠశాల ఏర్పాటు కోసం ప్రభుత్వం జీవో జారీ చేసిందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం చేయలేని అనేక అభివృద్ధి పనులను, తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అమలు చేస్తున్నానని ఎమ్మెల్యే మదన్ మోహన్ తెలిపారు.
Mla Madan Mohan | అభివృద్ధిలో రాజీలేదు..
ఈ సందర్భంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పర్చడంలో రాజీలేకుండా కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి వార్డు, ప్రతి కాలనీ సమగ్ర అభివృద్ధే తన ధ్యేయమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ ఛైర్మన్లు పద్మ శ్రీకాంత్, కుడుముల సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు ప్రశాంత్ గౌడ్, వినోద్ గౌడ్, వెంకటరామిరెడ్డి అధికారులు పాల్గొన్నారు.