అక్షరటుడే, ఇందూరు : MP Arvind | జిల్లాలో ఎందరో కాంగ్రెస్ నేతలు ఉన్నా.. అభివృద్ధి మాత్రం శూన్యమేనని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ రాష్ట్రంలో ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కబ్జా కేసులను ఆపుతుందన్నారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ఇప్పటికీ పరిహారం అందలేదన్నారు. రేవంత్ సర్కారు (Revanth Government) ఒక చెత్త కాగితం అని విమర్శించారు. యూజీడీ పనుల్లో ఎటువంటి పురోగతి లేదని, ప్రతి దీక్ష సమావేశాల్లో చెప్పినా లాభం లేకుండా పోతుందన్నారు. జిల్లా కలెక్టర్ (District Collector) హామీ ప్రకారం వచ్చే ఆరు నెలల్లో పూర్తి చేస్తారనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు.
MP Arvind | ఎంఐఎం చేసింది ఏమీ లేదు..
రాష్ట్రంలో ఎంఐఎం ముస్లింలకు చేసింది శూన్యమని ఎంపీ అర్వింద్ అన్నారు. మైనార్టీలు వాస్తవాలను గ్రహించి కాంగ్రెస్, బీఆర్ఎస్లకు కాకుండా పనిచేసే వాళ్లకు అవినీతి రహిత పాలన అందించే వారికి ఓటేయాలన్నారు. 70 ఏళ్లలో కాంగ్రెస్ (Congress) ముస్లింలకు ఏం చేసిందో ప్రశ్నించాలని సూచించారు.
MP Arvind | నిజామాబాద్ జిల్లా పేరు ఇందూరుగా..
నిజామాబాద్‌ను (Nizamabad) ఇందూరుగా మార్చే పని నగర ప్రజల చేతుల్లో ఉందన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో వారు నూటికి నూరుశాతం మార్చనున్నారని పేర్కొన్నారు. అర్బన్‌లో ఎంఐఎం బీజేపీ (BJP) మాత్రమే గెలుస్తాయని కాంగ్రెస్ రెండు డివిజన్లలో కూడా గెలిచే అవకాశం లేదన్నారు. కాంగ్రెస్‌కు పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువయ్యారని ఆరోపించారు. తాము మైనారిటీలకు కూడా సీట్లు ఇస్తామని, ముందుకు రావాలన్నారు. సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి (Dinesh Kulachari), రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోళ్ల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.