అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : PCC Chief Mahesh Goud | ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ (Congress party) లక్ష్యమని చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో (Panchayat elections) కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే ఎక్కువ మంది విజయం సాధించారని పేర్కొన్నారు. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికల్లో (municipal elections) విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన విషయం స్పీకర్ పరిధిలో ఉందన్నారు.
మీడియా సమావేశంలో సహకార కార్పొరేషన్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి, వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, నుడా ఛైర్మన్ కేశ వేణు, పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.