అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Case | లంచం తీసుకుంటూ ఓ డిప్యూటీ తహశీల్దార్ ఏసీబీకి చిక్కాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా (Nalgonda District) చండూరులో చోటు చేసుకుంది.
చండూరు డిప్యూటీ తహసీల్దార్ (Chandur Deputy Tahsildar)గా చంద్రశేఖర్ పని చేస్తున్నాడు. గట్టుపల్ మండలం (Gattupal Mandal) తెరెడ్డిపల్లికి చెందిన ఒక అక్రమ రిజిస్ట్రేషన్‌పై వివరాలు ఇవ్వాలని ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకున్నాడు. ఆ వివరాలు ఇవ్వడానికి డిప్యూటీ తహశీల్దార్ రూ.15 వేల లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఫిర్యాదుదారుడి నుంచి లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు డిటీ చంద్రశేఖర్‌ను హైదరాబాద్ బాలాపూర్ (Hyderabad Balapur)లోని తన నివాసంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ACB Case | ప్రతి పనికి రేటు
అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. ప్రతి పనికి రేటు కడుతున్నారు. పైసలు ఇస్తేనే పనులు చేస్తున్నారు. లేదంటే అది లేదు.. ఇది లేదని చెప్పి కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. ముఖ్యంగా తహశీల్దార్ కార్యాలయాల్లో అవినీతి రాజ్యం ఏలుతోంది. భూములకు సంబంధించి ప్రతి లావాదేవికి కొందరు డబ్బులు తీసుకుంటున్నారు. స.హ. చట్టం కింద వివరాలు ఇవ్వడానికి కూడా లంచం అడగడం తీవ్ర చర్చనీయాంశం అయింది.
ACB Case | లంచం ఇవ్వొద్దు
ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు (ACB Officers) సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number), వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని భరోసా ఇస్తున్నారు.
