అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ramachandra Naik | మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచందర్ నాయక్ సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy)ని కలిశారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా రామచందర్ నాయక్ పేరును ప్రకటించిన నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు.
కాగా.. ఇటీవల మంత్రివర్గ విస్తరణలో మూడు పదవులను భర్తీ చేసిన విషయం తెలిసిందే. బీసీ ముదిరాజ్ కులానికి చెందిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, మాల సామాజిక వర్గానికి చెందిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, మాదిగ సామాజిక వర్గం నుంచి ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు మంత్రి పదవులు వరించాయి. సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని మంత్రి పదవులను భర్తీ చేశారు. ఈ క్రమంలో ఎస్టీలకు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో ఆ వర్గానికి చెందిన డోర్నకల్ ఎమ్మెల్యే రామచందర్ నాయక్‌ను డిప్యూటీ స్పీకర్‌గా ప్రకటించారు. ప్రస్తుత స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎస్సీ సామాజిక చెందిన వారు కాగా.. డిప్యూటీ స్పీకర్ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం గమనార్హం.
Ramachandra Naik | డాక్టర్ నుంచి డిప్యూటీ స్పీకర్‌గా..
రామచందర్‌నాయక్ మహబూబాబాద్ జిల్లాలో 1975లో జన్మించారు. ఆయన 1998లో ఎంబీబీఎస్, 2001లో ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంఎస్ పూర్తి చేశారు. వైద్యుడిగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. రాంచందర్‌నాయక్ భార్య కూడా వైద్యురాలే. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. తాజాగా కాంగ్రెస్(Congress) ఆయనను డిప్యూటీ స్పీకర్‌గా ప్రకటించింది.