అక్షరటుడే, హైదరాబాద్: Deputy Collectors transfers | తెలంగాణ Telangana రెవెన్యూ శాఖలో బదిలీలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 16 మంది అదనపు కలెక్టర్లు, ఆర్‌డీవోలు, డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేశారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ సెక్రటరీ డీఎస్ లోకేష్ కుమార్ Revenue Department Secretary DS Lokesh Kumar బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Deputy Collectors transfers |
గద్వాల జిల్లా కొత్త DROగా జి. పద్మజా రాణి (వెయింటింగ్ Waiting లో ఉన్న అదనపు కలెక్టర్ additional collector) నియామకం అయ్యారు. మహబూబ్‌నగర్‌కు అదనపు కలెక్టర్‌గా జె.ఎల్.బి హరి ప్రియా (మేడ్చల్ డీఆర్వో) నియమితులయ్యారు.
యాదాద్రి భువనగిరికి కె. వెంకట రెడ్డి (శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్) ని బదిలీ చేశారు. ఆదిలాబాద్‌కు డి. భుజంగ రావు (మెదక్ డీఆర్వో Medak DRO డి. భుజంగరావు) అదనపు కలెక్టర్‌గా బదిలీ అయ్యారు.
గద్వాల RDOగా టి. శ్రీనివాస్ రావు -నర్సాపూర్ RDOగా పి. రామకృష్ణ నియమితులయ్యారు. సీసీఎల్ఏ అసిస్టెంట్ సెక్రటరీ వి.లచ్చిరెడ్డిని సికింద్రాబాద్ ఎస్టేట్ ఆఫీసర్‌గా నియామకం అయ్యారు.
చెవెల్ల RDOగా కె. పార్థ సింహా రెడ్డి నియామకం అయ్యారు. మెదక్, ఖమ్మం జిల్లాల్లోనూ RDOల మార్పులు జరిగింది. నల్గొండ స్పెషల్ కలెక్టర్ కార్యాలయంలో పి. మాధవి దేవి నియామకం అయ్యారు.
గద్వాల ఆర్డీవో ఎల్. అలివేలు.. గద్వాల హౌజింగ్ పీడీగా నియమితులయ్యారు. గద్వాల హౌజింగ్ బోర్డు పీడీ టి.శ్రీనివాసరావు.. గద్వాల ఆర్డీవోగా నియామకం అయ్యారు. సీసీఎల్ అసిస్టెంట్ సెక్రటరీ పి.రామకృష్ణ నర్సాపూర్ ఆర్డీవోగా బదిలీ అయ్యారు.
ఎల్లారెడ్డి ఆర్డీవో కె.పార్థసింహారెడ్డి చేవెళ్లకు బదిలీ అయ్యారు. నర్సాపూర్ ఆర్డీవో కె.మహిపాల్ రెడ్డి శేరిలింగంపల్లి తహశీల్దార్‌గా బదిలీ అయ్యారు. మెట్పల్లి ఆర్టీవో ఎన్.శ్రీనివాస్ ఖమ్మంకు బదిలీ అయ్యారు. ఖమ్మం ఆర్డీవో జి. నర్సింహారావు మెట్‌పల్లికి ట్రాన్స్ఫర్ అయ్యారు. వెయింటింగ్లో ఉన్న మాధవి దేవి నల్లగొండ స్పెషల్ కలెక్టర్ గా పోస్టింగ్ అందుకున్నారు.
డిప్యూటీ కలెక్టర్‌గా ప్రమోషన్ అందుకున్న ప్రభాకర్ ఎల్లారెడ్డి ఆర్డీవోగా నియమితులయ్యారు. డిప్యూటీ కలెక్టర్ రవీందర్ రెడ్డి కుడా (KUDA) స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా నియమితులయ్యారు. సికింద్రాబాద్ ఎస్టేట్ అధికారి అరుణను ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాల్సి ఉంది.
