అక్షరటుడే, ఇందూరు: Nizamabad Municipal Corporation | నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ కట్టడాలపై అధికారులు దృష్టి సారించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తూ.. నిబంధనలకు విరుద్దంగా సాగుతున్న భవన నిర్మాణాలపై చర్యలు తీసుకుంటున్నారు.
Nizamabad Municipal Corporation | నాగారం సమీపంలో..
రోడ్డుపై అక్రమంగా నిర్మించిన కట్టడాన్ని గురువారం నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం (Town Planning Department) అధికారులు కూల్చివేశారు. నగరంలోని నాగారం (nagaram) సమీపంలోని డీఎస్ కాలనీలో (DS Colony) రోడ్డు స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాన్ని చేపడుతున్నారని మున్సిపల్ అధికారులకు సమాచారం అందింది.
దీంతో స్పందించిన అధికారులు గురువారం కట్టడాన్ని కూల్చివేశారు. ఈ సందర్భంగా టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రభుత్వ స్థలంలో నాలాలపై ఎవరూ నిర్మాణాలు చేపట్టరాదన్నారు. అక్రమంగా నిర్మిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. నగరపాలక సంస్థ అనుమతితో తమ సొంత స్థలంలో మాత్రమే నిర్మాణాలు చేపట్టాలని తెలిపారు.