ePaper
More
    HomeతెలంగాణBribe | రేషన్​ కార్డు కోసం డబ్బులు డిమాండ్​.. ఏసీబీకి చిక్కిన కంప్యూటర్​ ఆపరేటర్​..!

    Bribe | రేషన్​ కార్డు కోసం డబ్బులు డిమాండ్​.. ఏసీబీకి చిక్కిన కంప్యూటర్​ ఆపరేటర్​..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Bribe | రాష్ట్రంలో ఏసీబీ దూకుడు కొనసాగుతోంది. అయినా అవినీతి అధికారుల్లో మార్పు రావడం లేదు. అందిన కాడికి దండుకోవడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. లంచాల పేరిట ప్రజలను పట్టి పీడిస్తున్నారు. ఇటీవల ఏసీబీ (ACB) దాడుల్లో అధికారులు పట్టుబడుతున్నా.. భయపడకుండా లంచాలు వసూలు చేస్తున్నారు. తాజాగా.. తహశీల్దార్​ కార్యాలయ (Tahsildar office) కంప్యూటర్​ ఆపరేటర్​ ఏసీబీకి చిక్కాడు.

    వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem district) బూర్గంపహాడ్ మండల తహశీల్దార్ కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్ చిట్టెంశెట్టి నవక్రాంత్ రేషన్​ కార్డు విషయంలో ఓ వ్యక్తి డబ్బులు డిమాండ్​ చేశారు. రేషన్ కార్డు దరఖాస్తును ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేసి కొత్త రేషన్ కార్డు జారీ చేయడం రూ. 2,500 డిమాండ్​ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. సదరు కంప్యూటర్​ ఆపరేటర్​ (computer operator) శనివారం లంచం తీసుకుంటుండగా.. అనిశా అధికారులకు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుబడ్డాడు. సదరు ఆపరేటర్​ గతంలోనూ పలువురు రేషన్ కార్డు దరఖాస్తుదారుల నుంచి లంచం డబ్బులను డిజిటల్ చెల్లింపుల రూపంలో తీసుకుంటున్నట్లు గుర్తించారు. ఏసీబీ అధికారులు అతడిపై కేసు నమోదు చేశారు.

    Bribe | డబ్బులు అడిగితే ఫిర్యాదు చేయండి

    ప్రజలు ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు (ACB officials) సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా తమకు ఫోన్​ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్​ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number)​కు ఫోన్​ చేస్తే అవినీతి అధికారుల పని చెబుతామని పేర్కొంటున్నారు. వాట్సాప్ 9440446106 నంబరు, ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ https://acb.telangana.gov.in ద్వారా కూడా అనిశాను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

    More like this

    Urea Shortage | యూరియా కొర‌త‌కు బీజేపీదే బాధ్య‌త‌.. మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Urea Shortage | తెలంగాణ‌లో యూరియా కొర‌తకు కార‌ణం బీజేపీయేన‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్...

    HMDA | హెచ్​ఎండీఏ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. ఆందోళన చేపట్టిన ఆర్​ఆర్​ఆర్​ భూ నిర్వాసితులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : HMDA | హైదరాబాద్ (Hyderabad)​ చుట్టూ రీజినల్​ రింగ్​ రోడ్డు (RRR) నిర్మాణానికి రాష్ట్ర...

    Ganesh immersion | ఎల్లారెడ్డిలో ప్రశాంతంగా ముగిసిన వినాయక నిమజ్జనం

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Ganesh immersion | పట్టణంలో ఆదివారం రాత్రి వినాయక నిమజ్జనోత్సవం ప్రశాంతంగా ముసిగింది. 11 రోజులుగా...