Chili’s Bar | చిల్లీస్ బార్​ను సీజ్ చేయాలని డిమాండ్​..

అక్షరటుడే, కామారెడ్డి: Chili’s Bar | కస్టమర్ల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న చిల్లీస్ బార్ అండ్ రెస్టారెంట్​ను సీజ్ చేయాలని మాజీ సీడీసీ చైర్మన్ ఐరేని నర్సయ్య (Former CDC Chairman Ireni Narsaiah) అన్నారు. బుధవారం ఆయన పట్టణంలోని (Kamareddy) ఆర్ అండ్​బీ గెస్టహౌస్​లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంగళవారం మధ్యాహ్నం తనతో పాటు మరికొందరం పట్టణంలోని సిరిసిల్ల రోడ్డులో ఉన్న చిల్లీస్ బార్ అండ్ రెస్టారెంట్​కు (Chili’s Bar […]

అక్షరటుడే, కామారెడ్డి: Chili’s Bar | కస్టమర్ల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న చిల్లీస్ బార్ అండ్ రెస్టారెంట్​ను సీజ్ చేయాలని మాజీ సీడీసీ చైర్మన్ ఐరేని నర్సయ్య (Former CDC Chairman Ireni Narsaiah) అన్నారు. బుధవారం ఆయన పట్టణంలోని (Kamareddy) ఆర్ అండ్​బీ గెస్టహౌస్​లో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంగళవారం మధ్యాహ్నం తనతో పాటు మరికొందరం పట్టణంలోని సిరిసిల్ల రోడ్డులో ఉన్న చిల్లీస్ బార్ అండ్ రెస్టారెంట్​కు (Chili’s Bar and Restaurant) వెళ్లామన్నారు. అక్కడ తాము అడిగినవి ఇవ్వకపోవడంతో బార్ నియమ నిబంధనలకు సంబంధించిన బోర్డు ఎక్కడ ఏర్పాటు చేశారని సిబ్బందిని ప్రశ్నిస్తే బార్ మేనేజర్ లక్ష్మీపతి వచ్చి తమతో దురుసుగా మాట్లాడటమే కాకుండా తనపై దాడికి పాల్పడటానికి ప్రయత్నించాడన్నారు.

ఈ విషయమై పోలీసులకు తాను ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయగా పోలీసుల ముందే తనను బార్ నుంచి గెంటేసేందుకు ప్రయత్నించారని తెలిపారు. అలాగే బార్​లో కుళ్లిన ఆహారం అందజేస్తున్నారని, అక్రమ మద్యం విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఫుడ్ ఇన్​స్పెక్టర్, ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నిబంధనలు అడిగిన వారిపై దాడులకు పాల్పడటం సరికాదని, అధికారులు పూర్తి విచారణ చేపట్టి బార్ అండ్ రెస్టారెంట్​ను సీజ్ చేయాలని కోరారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...