అక్షరటుడే, బోధన్ : 108 Ambulance | అత్యవసర పరిస్థితుల్లో 108 సిబ్బంది అంబులెన్స్‌లో గర్భిణికి డెలివరీ(Delivery) నిర్వహించారు. సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు.
వివరాల్లోకి వెళ్తే.. బోధన్ మండల కల్దుర్కి గ్రామానికి చెందిన లావణ్య అనే గర్భిణి పురిటినొప్పులు ఎక్కువకాగా.. 108కు సమాచారం ఇచ్చారు.తక్షణమే స్పందించిన సిబ్బంది ఆమెను తీసుకుని బోధన్ ప్రభుత్వాస్పత్రి(Bodhan Government Hospital)కి బయలుదేరారు. మార్గమధ్యంలో గర్భిణికి నొప్పులు ఎక్కువకాగా.. అంబులెన్స్‌లో డెలివరీ జరిగింది. పైలెట్ వెంకటి, ఈఎంటీ శివ దినేష్, ఆశావర్కర్(Asha Worker) నవనీత సాయంతో డెలివరీ నిర్వహించారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని.. తదుపరి వైద్యసేవల నిమిత్తం వారిని బోధన్ జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు అంబులెన్స్ సిబ్బంది(Ambulance Staff) పేర్కొన్నారు.