ePaper
More
    Homeక్రీడలుIPL 2025 | వీడిన ఉత్కంఠ.. ఆ మ్యాచ్ మళ్లీ జరగుతుంది!

    IPL 2025 | వీడిన ఉత్కంఠ.. ఆ మ్యాచ్ మళ్లీ జరగుతుంది!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: IPL 2025 | ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్ (punjab kings), ఢిల్లీ క్యాపిటల్స్ (delhi capitals) మధ్య ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్ భద్రతా కారణాల కారణంగా మధ్యలోనే రద్దు చేసిన విషయం తెలిసిందే. భారత్-పాకిస్థాన్ (india – pakistan) మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సరిహద్దు నగరాలు బ్లాకౌట్ పాటించడంతో (announce blackout at border citys) ఈ మ్యాచ్‌ను నిలిపివేయాల్సి వచ్చింది. అనంతరం ఐపీఎల్ 2025 సీజన్‌ను బీసీసీఐ ఓ వారం రోజుల పాటు వాయిదా (BCCI postponed IPL 2025 season one week) వేసింది.

    ఆటగాళ్ల ఆందోళనలు, ప్రసారకర్తలు, స్పాన్సర్స్, అభిమానుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా (BCCI secretary devajit saikia) శుక్రవారం ఓ ప్రకటనను విడుదల చేశారు. వారం రోజుల తర్వాత పరిస్థితిని పూర్తిగా అంచనా వేసి తదుపరి షెడ్యూల్‌ (next schedule) , మ్యాచ్‌ల వివరాలను వెల్లడిస్తామని తెలిపారు. భారత సాయుధ దళాల (india armed force) బలంపై బీసీసీఐకి (BBCI) పూర్తి విశ్వాసం ఉన్నప్పటికీ, ఐపీఎల్ వాటాదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఈ సీజన్‌లో ఇంకా 12 లీగ్ మ్యాచ్‌లతో పాటు ఫైనల్‌తో సహా నాలుగు ప్లే ఆఫ్ మ్యాచ్‌లు ఆడించాల్సి ఉంది.

    పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ రద్దు చేసినా (punjab kings and delhi capitals match suspend).. పాయింట్స్ కేటాయించలేదు. ఐపీఎల్ 2025 సీజన్ మళ్లీ ప్రారంభమైతే.. పంజాబ్, ఢిల్లీ మ్యాచ్‌ను ఆగిపోయిన దగ్గరి నుంచే కొనసాగించనున్నారని ఓ జాతీయ ఛానెల్ (national channel) పేర్కొంది. ప్లే ఆఫ్స్‌‌ సమీకరణంలో ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకం కావడంతోనే బీసీసీఐ (BCCI) ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

    ఈ మ్యాచ్ ఆగిపోయే సమయానికి పంజాబ్ కింగ్స్ (punjab kings) 10.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 122 పరుగులు చేసింది. ప్రియాన్ష్ ఆర్య (priyansh arya)(34 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 70), ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (prabhiman singh)(50) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో (delhi capitals bowlers) నటరాజన్ ఏకైక వికెట్ తీసాడు. ఈ స్కోర్ నుంచే మ్యాచ్‌ను కొనసాగించే అవకాశం ఉంది. అయితే వేదిక ఏదనేది అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయించనున్నారు. ఢిల్లీ, పంజాబ్ ఆటగాళ్లతో (delhi and panjab players) పాటు సహాయక సిబ్బంది, బ్రాడ్‌కాస్టర్స్ సిబ్బందిని బీసీసీఐ… ప్రత్యేకమైన వందే భారత్ ట్రైన్ (vande bharath train) ద్వారా ఢిల్లీకి తీసుకొచ్చింది. ధర్మశాల విమానాశ్రయం (dharamsala airport) మూసివేయడంతో వందే భారత్ ట్రైన్‌ను ఏర్పాటు చేసి ఆటగాళ్లను తరలించింది. ఇరు జట్ల ఆటగాళ్లంతా ఢిల్లీకి చేరుకున్నారు.

    Latest articles

    Torrential rain | దంచికొట్టిన వాన.. గంటలో 7 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు..

    అక్షరటుడే, హైదరాబాద్: torrential rain పగలంతా ఉక్కపోతతో మహానగర metropoli ప్రజలు అల్లాడారు. సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా...

    Critical Minerals | యువతకు గుడ్​ న్యూస్​.. రాష్ట్రానికి రెండు క్రిటికల్​ మినరల్స్ రీసెర్స్ సెంటర్స్ మంజూరు!

    అక్షరటుడే, హైదరాబాద్: Critical Minerals : తెలంగాణ (Telangana) విద్యా పొదిలో మరో రెండు కీలక పరిశోధన కేంద్రాలు...

    Collector Kamareddy | జుక్కల్​ సీహెచ్​సీ సూపరింటెండెంట్​, డ్యూటీ డాక్టర్​కు షోకాజ్​ నోటీసులు

    అక్షరటుడే, నిజాంసాగర్​: Collector Kamareddy | జిల్లాలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల పట్ల కామారెడ్డి కలెక్టర్​ కొరడా జులిపిస్తున్నారు....

    CM Revanth | రాష్ట్రంలో భారీ వర్షాలు.. సీఎం రేవంత్​ కీలక ఆదేశాలు..

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : గ్రేటర్​ హైద‌రాబాద్‌ (Greater Hyderabad) తో పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు...

    More like this