అక్షరటుడే నిజామాబాద్ సిటీ : CP Sai Chaitanya | రోడ్డు ప్రమాదాల నివారణకు అరైవ్, అలైవ్, డిఫెన్సివ్ డ్రైవింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ (Nizamabad Police Commissionerate) పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి కుటుంబం మీద ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావం ఉంటుందన్నారు. ఈ ప్రమాదాలను నివారించడానికి ప్రధానంగా రోడ్లపై అవగాహన పెంచడానికి, ప్రయాణికులు సురక్షితంగా తమ గమ్యస్థానానికి చేరేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేసేందుకు అరైవ్ – అలైవ్ – డిఫెన్సివ్ డ్రైవింగ్ కార్యక్రమం చేపట్టామన్నారు.
CP Sai Chaitanya | ముఖ్య ఉద్దేశ్యాలు ఇవే..
రోడ్డు ప్రమాదాలను (Road Accidents) తగ్గించడం, సేఫ్ డ్రైవింగ్ అలవర్చుకోవడం, డ్రంకన్ డ్రైవ్‌లు తగ్గించడం, హెల్మెట్, సీట్ బెల్టు వాడకం పెంపు, ఓవర్ స్పీడ్, డ్రైవింగ్‌లో మొబైల్ ఫోన్ వాడకం తగ్గించేవిధంగా వాహనదారులకు ప్రధాన ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.
CP Sai Chaitanya | ఎక్కడెక్కడంటే..
అరైవ్ – అలైవ్ – డిఫెన్సివ్ డ్రైవింగ్ కార్యక్రమాలు (Defensive Driving Programs) ఇప్పటినుంచి అన్ని స్కూళ్లు, కళాశాలలు, ఆఫీసుల్లో పనిచేసే వారికి, గ్రామాల్లో, రహదారికి ఇరువైపులా ఉన్న ప్రధాన జంక్షన్ల వద్ద పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.
