41
అక్షరటుడే, బోధన్: DCM van collided డీసీఎం వ్యాన్ ఢీ కొని ఒకరు దుర్మరణం చెందారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ శివారులో చోటుచేసుకుంది. బోధన్ శివారులోని రుద్రా వెంచర్ సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద మంగళవారం (జనవరి 13) రోడ్డు ప్రమాదం జరిగింది.
DCM van collided | కేసు దర్యాప్తు..
ద్విచక్ర వాహనాన్ని డీసీఎం వ్యాన్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనాస్థలికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడిని లంగ్డపూర్ గ్రామానికి చెందిన అంజిగా గుర్తించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.