అక్షరటుడే, ఆర్మూర్: Nizamaabad Congress | కాంగ్రెస్ కార్యకర్తల అభిప్రాయం మేరకే డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక (DCC president elections) జరుగుతుందని ఏఐసీసీ పరిశీలకుడు, బెంగళూరు ఎమ్మెల్యే రిజ్వాన్ హర్షద్ పేర్కొన్నారు. ఆర్మూర్ (Armoor), నందిపేట్ (Nandipet) బ్లాక్‌ల వారీగా బుధవారం అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక పారదర్శకంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తల అభిప్రాయాన్ని సేకరిస్తామని ఆయన స్పష్టం చేశారు. సమావేశాల్లో ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, నందిపేట్ మండల అధ్యక్షుడు మంద మహిపాల్, డొంకేశ్వర్ మండల అధ్యక్షుడు భూమేశ్వర్ రెడ్డి, మాక్లూర్ మండల అధ్యక్షుడు రవి ప్రకాష్, ముఖ్య నాయకులు బూత్ అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, మండల గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.