అక్షరటుడే, కామారెడ్డి : POCSO Case | రామారెడ్డి పోలీస్ స్టేషన్ (Ramareddy police station) పరిధిలో ఇద్దరిపై పొక్సో కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒకరిని పోలీసులు రిమాండ్ చేశారు.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. రామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తిపై ఆయన కూతురు (daughter) పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను బూతు మాటలు తిడుతున్నాడని, ఇబ్బందులకు గురి చేస్తున్నాడని పేర్కొంది. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు (Case registered) చేసి రిమాండ్కు తరలించారు.
అయితే తన కూతురు విషయంలో ఓ బాలుడు వ్యవహరించిన తీరుపై బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సదరు బాలుడిపై సైతం పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఈ మేరకు విచారణ చేపడుతున్నారు. ఈ విషయమై రామారెడ్డి ఎస్సై లావణ్యను వివరణ కోరగా ఇద్దరిపై పొక్సో కేసు నమోదైన విషయం నిజమేనన్నారు.