అక్షరటుడే, ఎల్లారెడ్డి: Datta Jayanti | పట్టణంలో దత్తత్రేయ జయంతిని (Dattatreya Jayanti) గురువారం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజ కార్యక్రమాలు, ధ్వజారోహణం, దత్తాత్రేయని డోలారోహణం, గురుపూజ, అఘోత్తర 128 దీపారాధన, మంగళహారతి, మహా నివేదన తదితర కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమాలకు భక్తులు పెద్దసంఖ్యలో హాజరై ప్రత్యేకపూజలు (special pujas) చేసి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. అయ్యప్పస్వామి (Ayyappa Swamy) మాలధారులు, ఇతర భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.
ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో నిర్వహించిన శ్రీ దత్తాత్రేయ జయంతి వేడుకల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ (Jajala Surender) పాల్గొని దత్తాత్రేయుడికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సురేందర్‌ను పూజారితో పాటు ఆలయ నిర్వాహకులు తులసీదాస్ ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
