Homeతాజావార్తలుDandruff | చుండ్రుతో చింతేలా.. ఇంట్లోనే చికిత్స ఉందిగా..!

Dandruff | చుండ్రుతో చింతేలా.. ఇంట్లోనే చికిత్స ఉందిగా..!

Dandruff | చుండ్రు నివారణలో తీసుకునే ఆహారం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. శీతాకాలంలో చాలామంది వేడి వేడి నూనెలో వేయించిన ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Dandruff | శీతాకాలం వచ్చిందంటే చాలు.. చల్లని గాలులు, తక్కువ తేమతో కూడిన వాతావరణం చర్మాన్ని, ముఖ్యంగా తలపై చర్మాన్ని (స్కాల్ప్) పొడిబారేలా చేస్తాయి. ఈ పొడిదనం కారణంగానే పొలుసులుగా వచ్చి, విపరీతమైన చుండ్రు (Dandruff) సమస్య మొదలవుతుంది.

తరచుగా వచ్చే దురద, తెల్లటి పొట్టుతో ఈ సమస్య చాలా ఇబ్బంది పెడుతుంది. అయితే, నిపుణులు సూచించిన కొన్ని చిన్న చిన్న చిట్కాలతో ఈ చికాకు పుట్టించే సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే జుట్టు ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంటుంది.

Dandruff | హైడ్రేషన్ షాంపూ :

పొడిబారిన తలపై చర్మానికి తిరిగి తేమను అందించడానికి హైడ్రేషన్ షాంపూలు చాలా బాగా పనిచేస్తాయి. ఈ షాంపూలలో ఉండే అలోవెరా (కలబంద), కొబ్బరి పాలు, గ్లిసరిన్ వంటి సహజ పదార్థాలు స్కాల్ప్‌కు అవసరమైన పోషకాలను అందించి, సహజ సమతుల్యతను కాపాడతాయి. కలబంద, కొబ్బరి పాలు, గ్లిసరిన్ వంటి తేమను ఇచ్చే పదార్థాలు ఉన్న షాంపూలను ఎంచుకోవాలి.

వాడకూడనివి: సల్ఫేట్, ఆల్కహాల్ (Alcohol) వంటి కఠిన రసాయనాలు ఉండే షాంపూలకు దూరంగా ఉండాలి. ఇవి చర్మాన్ని మరింత పొడిగా మారుస్తాయి.

నూనెతో మసాజ్: తరచుగా తలకు నూనె పెట్టుకోవడం మన అమ్మమ్మల కాలం నుంచి వస్తున్న మంచి అలవాటు. ఇది కేవలం జుట్టు ఆరోగ్యానికే కాక, చుండ్రు నివారణలోనూ ప్రభావవంతంగా పనిచేస్తుంది. చలికాలంలో సహజసిద్ధమైన నూనెలు స్కాల్ప్‌కు లోతైన తేమను అందించి, పొడిబారకుండా కాపాడతాయి.

వాడాల్సినవి: కొబ్బరి నూనె, ఆలివ్ నూనె (Olive Oil) లేదా బాదం నూనె (Almond Oil) వంటి సహజసిద్ధమైన నూనెలను ఉపయోగించాలి.

ఎలా చేయాలి: తలకు నూనె పట్టించి, వేళ్లతో సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల నూనె కుదుళ్ల వరకు చేరి, రక్త ప్రసరణను మెరుగవుతుంది.

సమయం: కనీసం అరగంట పాటు నూనెను ఉంచి, ఆ తర్వాత తలస్నానం చేయాలి. లేదా రాత్రి పడుకునే ముందు నూనె రాసుకుని, ఉదయం షాంపూతో స్నానం చేస్తే మరింత మంచి ఫలితం కనిపిస్తుంది.

గోరువెచ్చని నీటితో స్నానం:

చలికాలంలో వేడి నీటి స్నానం చాలా హాయినిస్తుంది. అయితే, మరీ వేడి నీటితో తలస్నానం చేయడం వల్ల స్కాల్ప్ మరింత పొడిబారుతుంది. అధిక వేడి నీరు జుట్టులోని సహజ తేమను తొలగించి, చుండ్రు రావడానికి కారణమవుతుంది. తలస్నానానికి గోరువెచ్చని లేదా చల్లటి నీటిని మాత్రమే వాడటం ఉత్తమం.

సమతుల్య ఆహారం :

చుండ్రు నివారణలో తీసుకునే ఆహారం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. శీతాకాలంలో చాలామంది వేడి వేడి నూనెలో వేయించిన ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటారు, నీళ్లు తక్కువగా తాగుతారు. దీనివల్ల కూడా స్కాల్ప్ పొడిబారి పొట్టు వస్తుంది.

తినాల్సినవి: చర్మాన్ని లోపలి నుంచి హైడ్రేట్ గా ఉంచడానికి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, జింక్ ,విటమిన్ బి అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి.

నట్స్ (బాదం, వాల్‌నట్), ఆకుకూరలు (పాలకూర, తోటకూర) తినాలి. నీటిని పుష్కలంగా తాగాలి. సాధారణ టీ కాకుండా, హెర్బల్ టీ లు కూడా మంచి ఫలితాలనిస్తాయి.

ఈ సులభమైన చిట్కాలను పాటిస్తే, శీతాకాలంలో కూడా చుండ్రు సమస్యకు దూరంగా ఉండి, ఆరోగ్యవంతమైన జుట్టును సొంతం చేసుకోవచ్చు.

Must Read
Related News