అక్షరటుడే, వెబ్డెస్క్: Danam nagender | బీఆర్ఎస్ సభపై కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Mla danam nagedar) కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించనున్న బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ(Brs silver jubilee) సభ సక్సెస్ అవుతుందని.. కేసీఆర్‌ని చూడటానికి జనం ఆశగా ఉన్నారని వ్యాఖ్యానించారు. సభకు భారీగా జనం రావొచ్చని పేర్కొన్నారు. అలాగే. స్మితా సబర్వాల్ (Smita sabharwal) రీట్వీట్ చేయడంలో తప్పేమీ లేదని పేర్కొన్నారు. స్మితా సబర్వాల్ వాస్తవాన్నే రీట్వీట్ చేశారని, ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసినట్టు లేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కాంగ్రెస్ నేత దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి. దానం ఏమైనా అటు వైపు తొంగిచూస్తున్నారా.. అనే వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిర్స్లో చక్కర్లు కొడుతున్నాయి.