అక్షరటుడే, వెబ్‌డెస్క్: Madhya Pradesh | ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, గుంటూరు వంటి ప్రాంతాల్లో రైతులు, కూలీలకు వజ్రాలు దొరికిన సంఘటనలు చాలా చూశాం. లక్షల విలువ గల రత్నాలు పొలాల్లో దొరికిన ఘటనలు అప్పుడప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి. ఇలాంటి అదృష్ట ఘటన ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో (Madhya Pradesh) జరిగింది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో (Panna District) నిసార్ అనే గనిలో పనిచేస్తున్న హర్‌గోవింద్ యాదవ్ అనే రోజువారీ కూలీకి అదృష్టం తలుపు తట్టింది. ఛతర్‌పుర్ జిల్లా కటియా గ్రామానికి చెందిన హర్‌గోవింద్, ఆయన భార్య పవన్‌దేవి గత ఐదేళ్లుగా పన్నా జిల్లాలో గనిలో పనిచేస్తున్నారు. ఎప్పటిలాగే రోజు వారి పనిలో ఉన్న సమయంలో ఒక్కసారిగా వారికి 8 వజ్రాలు దొరికాయి.
Madhya Pradesh | రాత మారింది..
అధికారుల అంచనాల ప్రకారం, ఈ వజ్రాల మొత్తం విలువ దాదాపు రూ.12 లక్షల వరకు ఉండవచ్చని అంచనా. అయితే ఈ వజ్రాలను(Diamonds) వేలంలో అమ్మిన తర్వాత, అందులో నుంచి పన్నులు మినహాయించి మిగిలిన మొత్తాన్ని హర్‌గోవింద్ కుటుంబానికి అందిస్తారు. ఈ సందర్భంలో హర్‌గోవింద్ మాట్లాడుతూ..”ఈసారి భగవంతుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. గతంలో కూడా ఓ వజ్రం దొరికింది. కానీ అప్పుడు సరైన అవగాహన లేక కేవలం రూ.లక్ష మాత్రమే నా చేతికి వచ్చాయి. ఈసారి అలాంటి పొరపాటు జరగదు అని అన్నారు. ఈ తరహా సంఘటనలు మనకు భావితరాలకు గుర్తుండిపోయేలా ఒక మెసేజ్ ఇస్తాయి.
కష్టపడితే ఎప్పుడో ఒకప్పుడు అదృష్టం తలుపుతడుతుంది.. హర్‌గోవింద్‌కు దక్కిన ఈ అదృష్టం ఇప్పుడు పలువురిలో ఆశలు రేపుతుంది. ఇలాంటి వార్తలు చదువుతున్నప్పుడు చాలా మంది కూడా ఇలాంటి అదృష్టం ఒకసారి మన తలుపు తడితే బాగుంటుంది కదా అని అనుకోవడం సహజం.