Homeతాజావార్తలుHoroscope today | నేడు ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..

Horoscope today | నేడు ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..

ఈ రాశుల వారికి ఇవాళ పట్టిందల్లా బంగారమే కానుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 15.10.2025 నాడు 2 రాశులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి.

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్: Horoscope today | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 15.10.2025 నాడు 2 రాశులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఇవాళ వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. మరికొన్ని రాశుల వారికీ ప్రతికూల ఫలితాలు వస్తాయి.

Horoscope today | నేటి రాశిఫలాలు ఇవే..

మేషరాశి (Aries) : వీరు మంచి ఆలోచన శక్తిని కలిగి ఉంటారు.తల్లిదండ్రుల ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. వృత్తి పరంగా బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఖర్చుల విషయంలో భాగస్వామితో తగాదాలు రావచ్చు. ఇవాళ భాగస్వామికి ముత్యాలు లేదా గాజుతో తయారు చేసిన బహుమతిని ఇవ్వాలి.

వృషభ రాశి (Taurus) : ఇవాళ మీ దయా స్వభావం వలన ఎన్నో సంతోషకరమైనా క్షణాలను పొందుతారు.బయటికి వెళ్ళే మందు పెద్దవారి ఆశీర్వాదం తీసుకోవాలి.ఇలా చేయడం వలన ఏ పని చేసిన కలిసి వస్తుంది. భావోద్వేగాలు వీరిని చికాకు కలిగిస్తాయి. పెండింగ్ పనులను పూర్తిచేస్తారు. ఇవాళ శుక్ర యంత్రాన్ని వెండి పాత్రపై చెక్కడం ద్వారా సంతోషాన్ని పొందుతారు.

మిథున రాశి (Gemini) : వీరు సానుకూల దృక్పథంతో ఇంటి నుండి బయటకు వెళతారు. కానీ ముఖ్యమైనా వస్తువులను పోగొట్టుకుంటారు.దీని వలన కొంచెం దిగులుగా ఉంటారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.లేదంటే వివాదాలు వచ్చే అవకాశం ఉంది.పోటీ పరీక్షలు రాసేవారు మంచి ఫలితాలను పొందుతారు. ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్న వారికి పాలు దానం చేయాలి.

కర్కాటక రాశి (Cancer) : వీరు సరదా ,సంతోషాలను కలిగి ఉంటారు. స్నేహితులతో గొడవలకు దూరంగా ఉండండి.కళలను ప్రదర్శించడానికి కొత్త అవకాశాలు వస్తాయి.మీరు మంచి శుభవార్తను వింటారు.ప్రయాణం చేసే అవకాశం ఉంది.జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.ఉదయం,సాయంత్రం 11 సార్లు ఓమ్ బ్రాం బ్రీం బ్రమ్ బూదాయ నమహా అని పఠించాలి.

సింహ రాశి (Leo) : వీరి ఆరోగ్యం బాగుంటుంది.స్నేహితులకు డబ్బును అప్పుగా ఇవ్వడం వలన మీరు ఆర్థికంగా దెబ్బతింటారు. మీ కార్యకలాపాలను సక్రమంగా చేయాలనుకుంటే కొత్త పద్దతులను ప్రారంభించండి. వ్యక్తిగత సమయం ఎంత ముఖ్యమూ తెలుసుకోవాలి. ఇవాళ ఖాళీగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడటానికి మీ తండ్రికి లేదా తండ్రి వయస్సులో ఉన్న వారికి బెల్లం,గోధుమ,కుంకుమ వంటి వాటిని ఇవ్వాలి.

కన్యా రాశి (Virgo) : వినోదం,విలాసాలకు ఎక్కువ ఖర్చు చేసే అవకాశం ఉంది.మీలో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది.కుటుంబంలో ఉన్న సమస్యలను సులువుగా పరిష్కరిస్తారు. మీ లక్ష్యాలను సాధించడానికి మౌనంగా పనిచేస్తూ పోవాలి. విజయం తీరం చేరే వరకు మీ ధ్యేయాలను ఎవరికి చెప్పకూడదు.ఇవాళ చాలా సంతోషంగా ఉంటారు.మీ స్నేహితులతో కఠినంగా మాట్లాడకూడదు.

తులా రాశి (Libra) : ఎన్ని కష్టాలు ఎదురైనా చిరునవ్వుతో సులువుగా పరిష్కరించుకోగలుగుతారు. ఖర్చులను తగ్గించుకోవడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పిల్లలతో ఓర్పుగా ఉండాలి.మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఆఫీసులో ఇవాళ అంతా తోటి ఉద్యోగులు మీతో సన్నిహితంగా ఉంటూ, మీకు సహాయపడతారు. విద్యార్థులు స్నేహితులతో కలిసి బయటికి వెళ్ళకపోవడం మంచిది.చదువు పట్ల ఇంకా ఎక్కువ శ్రద్ధ చూపించాలి. ఇవాళ గణేశుడి ఆలయానికి వెళ్ళాలి.

వృశ్చిక రాశి (Scorpio) : అందరికి దూరంగా ఉన్నట్టు, ఒంటరిని అనే భావనతో ఉంటారు.ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. స్నేహితులతో, కొత్తవారితో జాగ్రత్తగా ఉండండి. ఉమ్మడి వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ భాగస్వామితో భావోద్వేగాలకు లోనవుతారు. ఆనందంగా ఉండటానికి స్నేహితులతో గడపాలి. మంచి అనుభూతిని పొందుతారు. ఇవాళ పూజాగదిలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతి రోజు ఆరాధించాలి.

ధనుస్సు రాశి (Sagittarius) : బాధని తరిమేయాలి. లేదంటే అది మీ అభివృద్ధికి అడ్డుపడుతుంది. మీరు మీ కుటుంబంతో కలిసి పెట్టుబడులు, పొదుపుల గురించి చర్చించుకోవాలి. వారి సలహాలు ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకునేందుకు సహాయపడతాయి. మీరు పనిచేసే చోట మంచి ఫలితాలు పొందుతారు. మీకున్న నైపుణ్యాలను ఉపయోగించడం వలన మంచి పేరు తెచ్చుకుంటారు సెమినార్లు, ఎగ్జిబిషన్లు వలన కొత్త విషయాలను తెలుసుకుంటారు. ఇవాళ రావి చెట్టు మూలాలపై నూనె పోయాలి.

మకర రాశి (Capricorn) : వీరు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి.భయాలను కూడా వదిలేయాలి. స్థిరపడిన, పేరు పొందిన వ్యాపారవేత్తలు ఇవాళ పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. కుటుంబీకుల పట్ల వాదనలకు దూరంగా ఉండాలి. ఇవాళ కొత్త వ్యక్తులని కలిసే అవకాశం ఉంది. ఇతరులతో సన్నిహితంగా ఉండాలి. కానీ మీ అభిప్రాయాలను వారి ముందు బయటపెట్టకూడదు. ఇవాళ ఆహార పదార్థాలను దానం చేయాలి.

కుంభ రాశి (Aquarius) : ఇవాళ మీకున్న టెన్షన్ నుండి బయటపడతారు. ధనాన్ని జూదంలో, బెట్టింగ్‌లో పెట్టడం వలన నష్టపోతారు. వాటికి దూరంగా ఉండాలి. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో గడపడానికి సమయం కేటాయించాలి. ఇవాళ విష్ణువుని పూజించాలి. మద్యం, మాంసం తీసుకోకూడదు.

మీన రాశి (Pisces) : వీరు అలసట, నీరసంగా ఉంటారు. వ్యాపారస్తులు మంచి లాభాలను పొందుతారు.మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. పోటీ పరీక్షలకు వెళ్ళే వారు ప్రశాంతంగా ఉండాలి. తోటి వారికి దూరంగా ఉండటం వలన సమస్యలు రాకుండా ఉంటాయి. ఇవాళ పాలు, బియ్యం. చక్కెరతో చేసిన పాయసం నైవేద్యం పెట్టాలి.