అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Cyclone Senyar | బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపాన్‌గా మారింది. దానిని సెన్యార్ తుపాన్ (Cyclone Senyar) అని పేరు పెట్టారు. సెన్యార్ ప్రస్తుతం మలక్కా జలసంధి ప్రాంతంలో కదులుతోంది. 24 గంటల తర్వాత క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు (Meteorological Department Officers) తెలిపారు.
మలేషియా సమీపంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం బుధవారం ఉదయం తుపాన్‌గా మారింది. దీనికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సెన్యార్ అని పేరు పెట్టినట్టు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పశ్చిమ దిశగా కదులుతున్న తుపాన్ ఇండోనేషియా (Indonesia) తీరం వైపు వెళ్లనుంది. దీని ప్రభావం భారత్‌పై తక్కువగా ఉంటుందని అంచాన వేస్తున్నారు. అయితే తీరం వెంబడి పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.
Cyclone Senyar | మరో అల్పపీడనం
ఇప్పటికే తుపాన్ దూసుకు వస్తుండగా.. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో దక్షిణ శ్రీలంక, హిందూ మహాసముద్రం మీదుగా అల్పపీడనం ఏర్పడింది. రానున్న 24 గంటల్లో ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఈ నెల 29 నుంచి భారీ వర్షాలు (Heavy Rains) కురిసే ఛాన్స్ ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఏపీతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సైతం వర్షాలు కురిసే అవకాశం ఉంది.
