Homeతాజావార్తలుCyclone Ditwah | దూసుకొస్తున్న దిత్వా తుపాన్​.. తెలంగాణకు వర్ష సూచన

Cyclone Ditwah | దూసుకొస్తున్న దిత్వా తుపాన్​.. తెలంగాణకు వర్ష సూచన

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాన్​ భారత్​ వైపు దూసుకు వస్తోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cyclone Ditwah | నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడి తుపాన్​గా మారింది. దీనికి దిత్వా అని పేరు పెట్టారు. ప్రస్తుతం శ్రీలంక తీరానికి 200 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 610 కి.మీ, చెన్నైకి ఆగ్నేయంగా 700 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయింది.

దిత్వా తుపాన్​ (Cyclone Ditwah) గంటలకు 15 కి.మీ. వేగంతో భారత్​వైపు దూసుకు వస్తోంది. ఆదివారం తెల్లవారుజాము వరకు నైరుతి బంగాళాఖాతం తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాలకు తుపాన్​ చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు (Meteorological Department Officers) తెలిపారు. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.

Cyclone Ditwah | పెరగనున్న చలిగాలులు

దిత్వా తుపాన్ కారణంగా తెలంగాణ (Telangana)లో చలిగాలులు పెరగనున్నాయి. నవంబర్ 28 రాత్రి నుంచి నవంబర్ 30 వరకు ఉత్తర, మధ్య తెలంగాణలో బలమైన శీతల వాతావరణం ఉంటుందని అధికారులు తెలిపారు. డిసెంబర్ 2నుంచి 5 వరకు దక్షిణ, తూర్పు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి – కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, మహబూబ్ నగర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి – భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, గద్వాల్, హైదరాబాద్, మేడ్చల్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే ఛాన్స్​ ఉంది.

Cyclone Ditwah | శ్రీలంకలో 56 మంది మృతి

దిత్వా తుపాన్​ కారణంగా శ్రీలంకలో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. వరదలు ముంచెత్తడంతో పాటు కొండచరియలు విరిగిపడి ఆ దేశంలో ఇప్పటి వరకు 56 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరో 21 మంది గల్లంతయ్యారు. వరదలతో 600కి పైగా ఇళ్లు, పాఠశాలలు దెబ్బతిన్నాయని చెప్పారు. గల్లంతైన వారి కోసం సహాయక సిబ్బంది గాలిస్తున్నారు. ముంపు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Must Read
Related News