అక్షరటుడే, వెబ్డెస్క్ : Cyclone Ditwah | నైరుతి బంగాళాఖాతంలో (southwest Bay of Bengal) ఏర్పడిన దిత్వా తుపాన్ క్రమంగా బలహీన పడుతోంది. రానున్న 12 గంటల్లో ఇది వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
దిత్వా తుపాన్ (Cyclone Ditva) గడిచిన 6 గంటల్లో 5 కి.మీ వేగంతో కదులుతోంది. నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం మీదుగా పయనం చేస్తోంది. ప్రస్తుతం చెన్నైకి 50 కి.మీ, పుదుచ్చేరికి (Puducherry) 150 కి.మీ, నెల్లూరుకి 200 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు ఆంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు (heavy rains) కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు.
దిత్వా తుపాన్ ప్రభావంతో తీరం వెంట బలమైన గాలులు వీస్తాయని అధికారులు పేర్కొన్నారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దన్నారు. ముంపు గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. అధికారులు సైతం అప్రమత్తం అయ్యారు. కాగా దిత్వా తుపాన్ కారణంగా తెలంగాణలో సైతం అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
