Homeఆంధప్రదేశ్Cyclone Ditwah | దూసుకొస్తున్న దిత్వా తుపాన్​.. పలు జిల్లాలకు అలెర్ట్

Cyclone Ditwah | దూసుకొస్తున్న దిత్వా తుపాన్​.. పలు జిల్లాలకు అలెర్ట్

బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాన్​ దూసుకు వస్తోంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Cyclone Ditwah | బంగాళాఖాతంలో (Bay of Bengal) ఏర్పడిన దిత్వా తుపాన్​ దూసుకు వస్తోంది. దీని ప్రభావంతో తమిళనాడులోని (Tamil Nadu) పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోని పలు ప్రాంతాలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

దిత్వా తుపాన్ శ్రీలంకలో (Sri Lanka) భారీ విధ్వంసం సృష్టించింది. వరదలు ముంచెత్తి ఆ దేశంలో చాలా మంది మరణించారు. ఈ తుపాన్​ ప్రస్తుతం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాలవైపు దూసుకు వస్తోంది. పుదుచ్చేరికి 300 కి.మీ., చెన్నైకి దక్షిణాన 400 కి.మీ. దూరంలో ఉన్న దిత్వా సైక్లోన్​ గంటకు 8 కి.మీ. వేగంతో కదులుతోంది. ఆదివారం ఉదయం తమిళనాడు తీర ప్రాంతాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ​ అధికారులు తెలిపారు.

Cyclone Ditwah | తమిళనాడులో అప్రమత్తం

దిత్వా తుపాన్​ (Cyclone Ditva) ప్రభావంతో శ్రీలంకలో 80 మంది చనిపోయారు. అనేక ఇళ్లు, రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. 20 మంది వరకు గల్లంతయ్యారు. ప్రస్తుతం తుపాన్​ తమిళనాడు వైపు వస్తుండటంతో ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఇప్పటికే ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. దక్షిణ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు రెడ్​ అలెర్ట్ జారీ చేశారు. దీంతో అధికారులు వరద ప్రభావిత ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. పలు జిల్లాల్లో శనివారం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. సహాయక బృందాలను సిద్ధం చేశారు.

Cyclone Ditwah | తెలుగు రాష్ట్రాల్లో

దిత్వా తుపాన్​ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో (Telugu states) సైతం మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఏపీలోని తీర ప్రాంతాల్లో ఈదురు గాలులు బీభత్సం సృష్టిస్తాయి. గాలులు 50 నుంచి 60 కి.మీ. వేగంతో వీస్తాయని అధికారులు హెచ్చరించారు. తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు (heavy rains) కురుస్తాయన్నారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వాన పడే ఛాన్స్​ ఉంది. తుపాను ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలను వరదలు ముంచెత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Must Read
Related News