ePaper
More
    HomeసినిమాActress Kalpika | క‌ల్పిక‌పై మ‌రో కొత్త కేసు.. ఈ సారి సైబ‌ర్​క్రైం న‌మోదు చేయ‌డానికి...

    Actress Kalpika | క‌ల్పిక‌పై మ‌రో కొత్త కేసు.. ఈ సారి సైబ‌ర్​క్రైం న‌మోదు చేయ‌డానికి కార‌ణం ఏంటంటే..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Actress Kalpika | సినీనటి కల్పికా గణేశ్ (Kalpika Ganesh) కొద్ది రోజులుగా వార్త‌ల‌లో నిలుస్తున్న విష‌యం తెలిసిందే. గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద ఉన్న ప్రిజం పబ్​లో(Prism Pub) బర్త్ డే వేడుకలు నిర్వహించారని.. బర్త్ డే కేక్ విషయంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరగ్గా.. పబ్ సిబ్బంది తనపై దాడి చేశారని కల్పిక ఆరోపించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులో తన పట్ల సిబ్బంది దురుసుగా ప్రవర్తించి.. బూతులు తిట్టారని.. తనకు క్షమాపణ చెప్పాలంటూ పబ్ బయట కల్పిక వాగ్వాదానికి దిగింది. ప‌బ్ యాజ‌మాన్యం(Pub Management) ఫిర్యాదుతో కల్పికపై కేసు నమోదు చేశారు పోలీసులు.

    Actress Kalpika | ఎందుకీ ర‌చ్చ‌..

    సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, యశోద, నమో వెంకటేశా, జులాయి, సారొచ్చారు, హిట్-1, పడి పడి లేచే మనసు వంటి సినిమాల్లో నటించి కల్పిక మంచి పేరే సంపాదించుకుంది. కొన్ని వెబ్‌సిరీసుల్లోనూ నటించింది. కానీ కొన్నాళ్ల క్రితం వరుస వివాదాల్లో చిక్కుకున్న కల్పిక.. ఇప్పుడు ఈ పబ్‌ వివాదంతో వార్తల్లోకి వచ్చింది. ఇప్పటికే ప్రిజం క్లబ్ వ్యవహారంలో కేసు ఎదుర్కొంటున్న ఆమెపై తాజాగా మరో సైబర్ క్రైం కేసు(Cyber ​​Crime Case) నమోదైంది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తనను అసభ్య పదజాలంతో దూషించారని, ఆన్‌లైన్‌లో వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ కీర్తన అనే యువతి హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    67 ఐటీఏ 2000-2008,79,356 BNS ప్రకారంగా కేసు నమోదు చేశారు. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌(Instagram Account)లో అసభ్యకరమైన పదజాలం ఉపయోగించి దూషించిందంటూ కల్పికపై బాధితురాలు కీర్తన ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో తన గురించి అభ్యంతరకరమైన స్టేటస్‌లు పెట్టడంతో పాటు, ఇన్‌బాక్స్‌కు మెసేజ్‌లు పంపి దారుణంగా మాట్లాడారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వేధింపులకు సంబంధించి కొన్ని స్క్రీన్‌షాట్లను కూడా కీర్తన పోలీసులకు ఆధారాలుగా సమర్పించారు. బాధితురాలి నుంచి ఫిర్యాదు స్వీకరించిన హైదరాబాద్ సైబర్​క్రైం పోలీసులు, ప్రాథమిక ఆధారాలను పరిశీలించిన అనంతరం నటి కల్పికా గణేశ్​పై కేసు నమోదు చేశారు. సైబర్ వేధింపుల ఆరోపణలతో కల్పిక మరోసారి చిక్కుల్లో పడినట్లయింది.

    More like this

    September 11 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 11 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగంతేదీ (DATE) – సెప్టెంబరు 11,​ 2025 పంచాంగంశ్రీ విశ్వావసు...

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...