అక్షరటుడే, వెబ్‌డెస్క్: Crypto currency | క్రిప్టో కరెన్సీ పెట్టుబడిదారులు ఇటీవల భారీ నష్టాలను మూటగట్టుకున్నారు. గత రెండు నెలల్లో రూ. 103 లక్షల కోట్లు నష్టపోయారు.
ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన బిట్ కాయిన్ ఆల్ టైం హై నుంచి 36% ఢమాల్న పడిపోయింది. గత అక్టోబరు 6వ తేదీన గరిష్టంగా రూ. 1.12 కోట్లకు కరెన్సీ విలువ నవంబరు 21వ తేదీన రూ. 71.88 లక్షలకు పడిపోయింది.
Crypto currency | 700 బిలియన్ల డాలర్ల తగ్గుదల
బిట్ కాయిన్ పతనంతో పెట్టుబడిదారుల సంపద 700 బిలియన్ డాలర్లు తగ్గడం గమనార్హం. టాప్ 10 క్రిప్టో కరెన్సీలో బిట్ కాయిన్ నిల్వ చేసే పరిశ్రమలు ఈటీఎఫ్‌లు సైతం పెట్టుబడిదారులకు భారీగా నష్టాలను మూటగట్టాయి.
ఇక భారత్‌లో దాదాపు 12 కోట్ల మంది ఇన్వెస్టర్లు ట్రేడింగ్ చేస్తుండటం గమనార్హం. దేశంలో క్రిప్టో మార్కెట్ విలువ రూ. 86 వేల కోట్ల వద్ద ఉంది. కేంద్ర ప్రభుత్వం క్రిప్టో కరెన్సీని లీగల్‌గా చూడటం లేదు. కానీ, దానిని బ్యాన్ కూడా చేయలేదు. ఈ నేపథ్యంలోనే ఇన్వెస్టర్ల భాగస్వామ్యం పెరుగుతోంది.
గత మే నెలలో బిట్ కాయిన్ ధర లక్ష డాలర్లను దాటింది. అనంతరం కూడా 30 శాతం విలువ పెరిగినట్లు ఇండియన్ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ ప్రతినిధులు చెబుతున్నారు.
