అక్షరటుడే, వెబ్‌డెస్క్: crypto currency | రూ.లక్షలు ఇన్వెస్ట్ చేస్తే.. రూ.కోట్లు వస్తాయని నమ్మబలికారు. కలర్స్ గ్రాఫిక్స్‌తో ఇంటర్నేషనల్ international రేంజ్లో కంపెనీలు చూపారు.
మూడు నెలల్లోనే పెట్టుబడులు మూడింతలు అవుతాయని ఆశ కల్పించారు. మాయగాళ్ల మాటలు నమ్మిన సామాన్య ప్రజలు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి నిలువు దోపిడీకి గురయ్యారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా (Karimnagar district) లో భారీ మోసం వెలుగు చూసింది. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు అంటూ వేలాది మంది నిలువు దోపిడీకి గురయ్యారు.
crypto currency | కోటికి పైగా పెట్టుబడి పెట్టినవారే 300కు పైగా బాధితులు..
వందల మంది సుమారు రూ.2 వేల కోట్ల వరకు నష్టపోయినట్లు తెలిసింది. ఇలాంటి వారిలో రూ.కోటికి పైగా ఇన్వెస్ట్ చేసి నిండా మునిగిపోయిన వారే సుమారు 300 మంది వరకు ఉండొచ్చని తెలుస్తోంది.
కొడిమ్యాలకు చెందిన మహిళ క్రిప్టో కరెన్సీ దోపిడీపై ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు మోసం వెలుగు చూసింది.
క్రిప్టో crypto కరెన్సీలో తొలిసారి ఇన్వెస్ట్ చేసిన వారికి సదరు పెట్టుబడి యాప్‌ల నిర్వాహకులు రెట్టింపు మొత్తం ఇచ్చారు. కారులను బహుమతిగా అందజేశారు.
దీంతో చాలా మంది ఆకర్షితులై రూ.లక్షల్లో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. క్రిప్టో కరెన్సీ అంటే డిజిటల్ వ్యాలెట్ digital wallet చెల్లింపు వ్యవస్థ.
దీనికి ఎక్కడా ఎలాంటి కార్యాలయం ఉండదు. విదేశాల్లో తమకు పెద్ద కంపెనీలు, గోల్డ్ మైన్స్ తదితర బిజినెస్‌లు ఉన్నట్లు అంతర్జాలం (Internet లో మాయా ప్రపంచాన్ని చూపించి, ఆకర్షిస్తారు.
వీటిని చూసే చాలా మంది అమాయక ప్రజలు మోసపోయినట్లు తెలుస్తోంది. అత్యాశకు పోతే మోసాలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.