అక్షరటుడే, వెబ్డెస్క్ : Smriti Mandhana | భారత క్రికెటర్ స్మృతి మంధాన (cricketer Smriti Mandhana) తన వ్యక్తిగత జీవితంపై వారాల తరబడి ఉన్న ఊహాగానాలకు ముగింపు పలికింది. సంగీత దర్శకుడు, చిత్ర నిర్మాత పలాష్ ముచ్చల్‌తో తన వివాహం రద్దు చేసుకున్నట్లు ఆమె ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం ఆమె ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు.
స్మృతి మంధాన, పలాశ్ ముచ్చల్ (Palash Muchhal) వివాహం నవంబర్ 23న జరగాల్సి ఉంది. మంధాన తండ్రి శ్రీనివాస్ అకస్మాత్తుగా గుండెపోటుకు గురవడంతో వివాహం వాయిదా పడింది. అనంతరం వారి ఇద్దరి పెళ్లి రద్దు అయినట్లు వార్తలు వచ్చిన అధికారికంగా ఎవరు స్పందించలేదు. తాజాగా దీనిపై స్మృతి స్పష్టత ఇచ్చింది. ‘‘కొన్ని వారాలుగా నా జీవితం చుట్టూ చాలా ఊహాగానాలు ఉన్నాయి. ఈ సమయంలో నేను మాట్లాడటం ముఖ్యమని భావిస్తున్నాను. నేను చాలా ప్రైవేట్ వ్యక్తిని, దానిని అలాగే ఉంచాలనుకుంటున్నాను, కానీ వివాహం రద్దు చేయబడిందని నేను స్పష్టం చేయాలి” అని మంధాన పోస్ట్ చేసింది. తమ కుటుంబాలు ముందుకు సాగడానికి స్థలం ఇవ్వాలని అభిమానులు, మీడియాను మంధాన కోరారు.
“నేను ఈ విషయాన్ని ఇక్కడ ముగించాలనుకుంటున్నాను, మీరందరూ కూడా అలాగే చేయాలని వేడుకుంటున్నాను. దయచేసి ఈ సమయంలో రెండు కుటుంబాల ప్రైవసీని గౌరవించాలని’’ ఆమె కోరారు. మరోవైపు పలాశ్ సైతం తమ పెళ్లి రద్దు అయినట్లు ప్రకటించారు. నవంబర్ 23న మహారాష్ట్రలోని (Maharashtra) సాంగ్లిలో వీరి పెళ్లి జరగాల్సి ఉంది. కానీ పెళ్లి రోజు ఉదయం మంధాన తండ్రి అనారోగ్యానికి గురి అయ్యాడు. దీంతో వాయిదా పడ్డ పెళ్లి తాజాగా రద్దు అయింది.