అక్షరటుడే, ఆర్మూర్: Cricket Tournament | క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక వికాసానికి ఉపయోగపడతాయని.. యువకులంతా సెల్‌ఫోన్ వదిలి క్రీడల వైపు రావాలని అంకాపూర్ (Ankapur) సర్పంచ్ దేవేందర్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలం (Armoor Mandal) అంకాపూర్‌లో రెండు రోజులుగా గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీల (Cricket Matches) ముగింపు కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు.
Cricket Tournament | విజేతలకు బహుమతులు..
విజేతగా నిలిచిన రెడ్డీస్ క్రికెట్ జట్టుకు, రన్నర్స్‌గా నిలిచిన పాతబస్తీ క్రికెట్ క్లబ్‌కు వీడీసీ అధ్యక్షుడు కుంట గంగారెడ్డి, కార్యదర్శి జంగం మురళి బహుమతి ప్రదానం చేశారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా శ్రావణ్ రెడ్డి మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా దినేష్ ఎంపికయ్యారు. బెస్ట్ బ్యాట్స్‌మెన్‌గా కళ్యాణ్, బెస్ట్ ఆల్ రౌండర్‌గా తరుణ్ బహుమతులు స్వీకరించారు. క్రీడల కన్వీనర్ నాగరాజు, వంశీకృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా అరుణ్, సాయి, అక్షయ్, కళ్యాణ్, దినేష్ రెడ్డి వ్యవహరించారు. బహుమతి ప్రదానోత్సవంలో పేట భాస్కర్ రెడ్డి, వినోద్ రెడ్డి, మంగలారం మహేందర్, ముక్తార్, నరహరి, సురేష్, గంగా మోహన్ పాల్గొన్నారు.