అక్షరటుడే, కోటగిరి: Cricket Tournament | సంక్రాంతి పండుగ సందర్భంగా కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామంలో (Kothapalli village) కేపీసీఎల్ పేరుతో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ పోటీల్లో (tournament) దాదాపు 40 టీంలు పాల్గొన్నాయి. అందులో విన్నర్‌గా నిలిచిన వర్ని మండలం (Varni mandal) వడ్డేపల్లి గ్రామానికి చెందిన టీంకు ప్రైజ్ మనీ రూ. 22,222 అందజేశారు.
రన్నర్‌గా నిలిచిన కొత్తపల్లి తండా జట్టుకు రూ.11,111 ప్రైజ్ మనీని ఎస్సై సునీల్, విద్యుత్ శాఖ ఏఈ బుచ్చిబాబు ఆదివారం బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. చదువుతో పాటు యువత, క్రీడల్లో రాణించాలన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులు ఎక్కువగా ఉంటారని వారిలో ప్రతిభను వెలికి తీసేందుకు క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మారెడ్డి, రమణారెడ్డి, కొండారెడ్డి, అప్పిరెడ్డి, సాయిలు, సుదర్శన్, అశోక్ రెడ్డి, కృష్ణారెడ్డి, రమణారెడ్డి, క్రికెట్ ఆర్గనైజర్స్, బబ్లు రామకృష్ణ గోవర్ధన్ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.