అక్షరటుడే, వెబ్‌డెస్క్: crashed american fighter jet | అమెరికా ఎయిర్ ఫోర్స్‌కు చెందిన అత్యాధునిక యుద్ధవిమానమైన ఎఫ్–16సి ఫైటర్ జెట్ దక్షిణ కాలిఫోర్నియా ఎడారిలో desert కుప్పకూలింది. యుద్ధ విన్యాసాల కోసం ప్రసిద్ధిగాంచిన ‘థండర్‌బడ్స్’ స్క్వాడ్రన్‌కు చెందిన ఈ విమానం క్రాష్ అవ్వడం ఆందోళన కలిగించినా, పైలట్ క్షేమంగా బయటపడటం పెద్ద ఉపశమనంగా భావిస్తున్నారు.
స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10.45 గంటలకు, ట్రోనా ఎయిర్‌పోర్ట్ సమీపంలో యుద్ధవిన్యాసాలు చేస్తుండగా విమానం అకస్మాత్తుగా నేలను ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే విమానం మంటలకు ఆహుతైంది. భారీ ఎత్తున మంటలు ఎగసిపడగా, దట్టమైన పొగ ఆకాశాన్ని కమ్మేసింది.
crashed american fighter jet | పారాచ్యూట్ తో పైలట్ ప్రాణరక్షణ
అయితే ప్రమాదాన్ని గ్రహించిన పైలట్, విమానం Aeroplane కుప్పకూలే ముందు పారాచ్యూట్ సహాయంతో బయటకు దూకి ప్రాణాలను రక్షించుకున్నారు. ఆ క్షణాల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పైలట్‌కు స్వల్ప గాయాలు కావడంతో, ఆయనను రిడ్జెక్రెస్ట్‌లోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదాన్ని ‘థండర్‌బడ్స్’ అధికారికంగా ధ్రువీకరించింది. మొత్తం 6 జెట్‌లతో శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతుండగా, వాటిలో ఒకటే కుప్పకూలినట్లు వెల్లడించింది.
అమెరికా ఎయిర్ ఫోర్స్ ఆ ప్రాంతంలో ఎఫ్–16 ఫైటింగ్ ఫాల్కన్ జెట్‌లతో తరచుగా యుద్ధవిన్యాసాల శిక్షణ చేపడుతోంది. ఒక్క ఇంజిన్‌తో నడిచే ఈ యుద్ధవిమానం అత్యంత వేగవంతంగా, ఆధునిక ఆయుధ వ్యవస్థలతో ప్రసిద్ధి చెందింది. అయితే ప్రమాదానికి గల కారణాలు వెల్లడికావాల్సి ఉంది.
సాంకేతిక లోపమా? లేక యుద్ధ విన్యాసాల సమయంలో ఏదైనా తప్పిదమా? అన్నదానిపై ఎయిర్ ఫోర్స్ దర్యాప్తు ప్రారంభించింది. ఈ ప్రమాదం ఆందోళన కలిగించినప్పటికీ, పైలట్ Pilot సురక్షితంగా బయటపడటం పెద్ద ఊరటగా మారిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
