Homeజిల్లాలునిజామాబాద్​CPI Nizamabad | బీసీ తెలంగాణ బంద్​కు సీపీఐ మద్దతు

CPI Nizamabad | బీసీ తెలంగాణ బంద్​కు సీపీఐ మద్దతు

తెలంగాణ వ్యాప్తంగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీసీ బంద్​కు పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు సీపీఐ పార్టీ ప్రకటించారు. ఈ మేరకు నగరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీపీఐ కార్యదర్శి సుధాకర్​ మాట్లాడారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: CPI Nizamabad | బీసీ జేఏసీ తలపెట్టిన తెలంగాణ బంద్​కు సీపీఐ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి సుధాకర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల (Bc Reservations) సాధనకు తెలంగాణ ఉద్యమ తరహాలోనే ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. బిల్లును ఆమోదించి రిజర్వేషన్లను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. బీసీ బిల్లును (BC Bill) పలు అగ్రవర్ణ కులాలు అడ్డుకోవడం సమంజసం కాదన్నారు.

రిజర్వేషన్ల అమలు, స్థానిక సంస్థల ఎన్నికలు నిలిచిపోవడానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వమని విమర్శించారు. శాసనసభలో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించి ఆర్డినెన్స్ జారీ చేసి గవర్నర్​కు పంపించినా స్పందించకపోవడం తగదన్నారు. సమావేశంలో నగర కార్యదర్శి ఓమయ్య, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.