Homeజిల్లాలునిజామాబాద్​CPI Nizamabad | సీపీఐ కార్మిక, కష్టజీవుల పార్టీ: మాజీ ఎంపీ అజిత్​ పాషా

CPI Nizamabad | సీపీఐ కార్మిక, కష్టజీవుల పార్టీ: మాజీ ఎంపీ అజిత్​ పాషా

సీపీఐ కష్టజీవుల పార్టీ అని మాజీ ఎంపీ అజిత్​ పాషా పేర్కొన్నారు. నిజామాబాద్​ నగరంలోని గంజ్​లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: CPI Nizamabad | సీపీఐ కార్మిక కష్టజీవుల పార్టీ అని మాజీ రాజ్యసభ ఎంపీ అజిత్ పాషా (Former Rajya Sabha MP Ajit Pasha) పేర్కొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ (Communist Party of India) వందేళ్ల పండుగ సందర్భంగా నగరంలోని గంజ్​లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అంతకముందు అర్సపల్లి నుంచి గాంధీ గంజ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

అనంతరం గంజ్​లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు సీపీఐ జిల్లా కార్యదర్శి పి. సుధాకర్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా మాజీ రాజ్యసభ ఎంపీ అజిజ్ పాషా, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు పశ్య పద్మ, రాష్ట్ర నాయకులు కంజర భూమయ్య, వలి ఉల్లా ఖాద్రి, డీజీ నరేంద్ర ప్రసాద్, ఉప్పలయ్య, ఓమయ్య హాజరయ్యారు.

అజిత్​ పాషా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ (Congress party) తర్వాత వందేళ్లు పూర్తి చేసుకున్న పార్టీ సీపీఐ మాత్రమేనన్నారు. దేశంలో ఎన్నో పార్టీలు పురుడు పోసుకుని అంతరించాయని, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు పుట్టిన ఈ పార్టీ మాత్రమే వందేళ్లు మనగడ సాధించిందన్నారు. ఆనాడు సాయుధ పోరాటంలో 5వేల మంది ప్రాణ త్యాగం చేశారన్నారు. కమ్యూనిస్టు పార్టీ కృషి వల్లే 10 లక్షల ఎకరాలు భూమిలేని నిరుపేదలకు పంపిణీ చేయడం జరిగిందన్నారు.

నిజాంపాలనకు వ్యతిరేకంగా సీపీఐ పోరాటాలు చేసిందన్నారు. డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే సభను విజయవంతం చేయాలని కోరారు. నిజామాబాద్ జిల్లా (Nizamabad district) నుంచి పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సవాల్లో పాలుపంచుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం (central government) బడా నాయకులకు దేశంలో ఉన్న సంపదను దోచిపెట్టే కుట్ర పన్నుతుందని, ప్రశ్నించే కమ్యూనిస్టులు దేశానికి ఎంతో అవసరమన్నారు. కేంద్ర ప్రభుత్వం 44 చట్టాలు బర్తరఫ్ చేసి నాలుగు నల్ల చట్టాలు తీసుకురావడం జరిగిందని, ఈ చట్టాల వల్ల ఎంతో నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు.

నాలుగు నల్ల చట్టాల యజమానులకి లాభం జరిగేలా ఉన్నాయని అవగాహన కల్పించడం జరిగిందని, సీపీఐ పార్టీ (CPI party) పోరాటాలతో కేంద్ర ప్రభుత్వం కొంత మేరకు తగ్గిందన్నారు. ఐక్య పోరాటాల వల్లనే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు పశ్యపద్మ మాట్లాడుతూ.. దేశాల ఆర్థిక స్థితిగతులను దెబ్బతీయడానికి ట్రంప్ ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. డిసెంబర్ 26న చరిత్రలో నిలిచి పోయే సీపీఐ శత జయంతి ఉత్సవ కార్యక్రమం విజయ వంతం చేద్దామన్నారు. జిల్లా నాయకులు రాజేశ్వర్, రాజన్న, స్వరూప రాణి, బి రఘురాం తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News