అక్షరటుడే, బోధన్: Nizamabad CP | బోధన్ పట్టణంలో దుర్గాదేవి నిమజ్జన శోభాయాత్ర (Durga Devi Nimajjana Shobhayatra) అంగరంగ వైభవంగా సాగుతోంది. పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్ సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) శోభాయాత్రకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా శోభాయాత్ర రథానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పోలీసులకు పలు సూచనలు సలహాలు చేశారు. శోభాయాత్ర ప్రశాంతంగా ముగిసేవరకు సిబ్బంది అలర్ట్గా ఉండాలని సూచించారు. అనంతరం యువతనుద్దేశించి మాట్లాడుతూ.. ఎలాంటి వదంతులు నమ్మవద్దని సూచించారు. సీపీ వెంట బోధన్ ఏసీపీ శ్రీనివాస్, టౌన్ సీఐ వెంకట నారాయణ తదితరులున్నారు.
Beaking News