Homeజిల్లాలునిజామాబాద్​CP Sai Chaitanya | ఇందల్వాయి చెక్​పోస్ట్​ను తనిఖీ చేసిన సీపీ

CP Sai Chaitanya | ఇందల్వాయి చెక్​పోస్ట్​ను తనిఖీ చేసిన సీపీ

పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పోలీసులు సరిహద్దుల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. దీంట్లో భాగంగా నిజామాబాద్ సీపీ సాయిచైతన్య ఇందల్వాయి టోల్ ప్లాజాను తనిఖీ చేశారు.

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CP Sai Chaitanya | గ్రామ పంచాయతీ ఎన్నికల్లో (Gram Panchayat elections) భాగంగా పోలీసులు సరిహద్దుల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు. దీంట్లో భాగంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయిచైతన్య (CP Sai Chaitanya) ఇందల్వాయి టోల్ ప్లాజాను గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ చెక్​పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో మాట్లాడారు. భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఎన్నికల సమయంలో అక్రమ రవాణా, నగదు, మద్యం అనుమానాస్పద వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని సీపీ తెలిపారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట తనిఖీల టీం ఇన్​ఛార్జి సాయి కుమార్, రవీందర్ సిబ్బంది ఉన్నారు.

Must Read
Related News